Premikudu Re Release: రీ రిలీజ్ కు రెడీ అవుతున్న శంకర్, ప్రభుదేవల సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ ‘ప్రేమికుడు’..

Sun, 08 Sep 2024-12:27 pm,

రీసెంట్ గా  పాత బ్లాక్ బస్టర్స్ మూవీలను రీ రిలీజ్‌ చేయడమనేది ఎక్కువ అయింది. రీసెంట్ గా మురారి, గబ్బర్ సింగ్ సినిమాలు రీ రిలీజ్ లో మంచి వసూళ్లనే రాబట్టాయి. ఈ కోవలో ప్రభుదేవా హీరోగా నగ్మా హీరోయిన్ గా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ప్రేమికుడు’ సినిమాను రీ రిలీజ్ చేస్తున్నారు.

మెగా ప్రొడ్యూసర్ కే. టి.  కుంజుమోన్ ప్రొడ్యూసర్ గా.. సెన్సేషనల్ డైరెక్టర్ ఎస్. శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ప్రేమికుడు’. ఈ సినిమాకు  ఏ. ఆర్. రెహమాన్ అద్భుతమైన మ్యూజిక్ అందించారు. ఈ సినిమాలో భారత మైఖేల్ జాక్సన్ ప్రభుదేవ, అందాల నటి నగ్మా జోడిగా నటించారు.

తాజాగా ఈ చిత్రాన్ని రమణ, మురళీధర్ నిర్మాతలుగా రీ రిలీజ్ చేస్తున్నారు. ఎస్పీ బాలసుబ్రమణ్యం, వడివేలు, రఘువరన్, గిరీష్ కర్నాడ్ ఇతర ముఖ్యపాత్రలో నటించారు. 30 యేళ్ల క్రితం వచ్చిన ప్రేమికుడు సినిమా మళ్లీ సెప్టెంబర్ 13న థియేటర్లలో ఘనంగా రి రిలీజ్ అవుతోంది.

ఎస్. శంకర్ దర్శకత్వంలో  ప్రభుదేవా, నగ్మా జంటగా మూడు దశాబ్దాల క్రితం విడుదలైన ఈ సినిమా అప్పటి యూత్ ను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పటికి కూడా ఆ సినిమాలోని పాటలు ఎవర్ గ్రీన్ హిట్ గా నిలిచాయి. ఈ చిత్రంలో ప్రభుదేవా తండ్రి పాత్రలో ఎస్. పి. బాలసుబ్రమణ్యం నటించారు.

 

ఈ సినిమాలో అందమైన ప్రేమ రాణి చెయ్యి తగిలితే పాటలో ప్రభుదేవా తో సమానంగా ఎస్. పి. బాలు  డాన్స్ చేయడం విశేషం. టేకిట్ ఈజీ పాలసీ, ఓ చెలియా నా ప్రియ సఖియా పాటలు ఇప్పటికీ ఎప్పటికీ ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ గా నిలిచాయి. ఒక మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీ గా వచ్చిన ఈ సినిమా అప్పటి రోజుల్లో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా ప్యాన్ ఇండియా లెవల్లో సెన్సెషన్ క్రియేట్ చేసింది.

ప్రేమికుడు చిత్రాన్ని జెంటిల్మెన్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై  మెగా ప్రొడ్యూసర్ కే. టి. కుంజుమోన్ నిర్మించారు. ఆస్కార్ విన్నర్ ఏ. ఆర్. రెహమాన్ అద్భుతమైన సంగీతం సమకూర్చారు. ఎస్. శంకర్ దర్శకత్వం వహించారు. తాజాగా ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా సీఎంఆర్ ప్రొడక్షన్స్ పతాకంపై  మురళీధర్ రెడ్డి, రమణ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link