Pragya Jaiswal: స్టైలిష్ డ్రెస్ లో ప్రగ్యా జైస్వాల్.. అందానికే అందంలో కనిపిస్తున్న నటి
తమిళ-తెలుగు ద్విభాషా చిత్రం ‘డేగ’ తో సినీ ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్. ఆ తరవాత ‘టిట్టూ ఎంబీఎ’ అనే హిందీ చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెట్టింది.
అయితే ఈ హీరోయిన్ కి మంచి పేరు తెచ్చిపెట్టింది మాత్రం వరుణ్ తేజ్ హీరోగా క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కంచె సినిమా. ఈ సినిమాలో సీతాదేవి పాత్రలో కనిపించి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది.
కానీ ఆ తర్వాత వచ్చిన ఈ హీరోయిన్ సినిమాలు అన్ని డిజాస్టర్ అవ్వడంతో ఛాన్సులు తగ్గిపోయాయి. మరలా ఈ మధ్య బాలకృష్ణ హీరోగా వచ్చిన అఖండ చిత్రంతో సూపర్ హిట్ అందుకుంది.
ఈ హీరోయిన్ చివరిగా కనిపించిన చిత్రం సన్నాఫ్ ఇండియా కాగా.. తన తదుపరి తెలుగు సినిమా కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.
ఈ క్రమంలో ప్రగ్యా జైస్వాల్ స్టైలిష్ గ్రీన్ డ్రెస్ లో ఇంస్టాగ్రామ్ లో షేర్ చేసిన ఫోటోలు వైరల్ అవుతూ అందరిని తెగ ఆకట్టుకుంటున్నాయి.