Pragya Jaiswal: మత్తుకళ్ళతో హిటేక్కిస్తున్న బాలయ్య బ్యూటీ.. ఫొటోస్ వైరల్.!

Mon, 02 Sep 2024-7:58 pm,

Pragya Jaiswal Latest Photos  టాలీవుడ్ లో అందం,  అభినయం ఉన్నప్పటికీ సక్సెస్ కి ఆమడ దూరంలో ఉన్న హీరోయిన్ లలో బాలయ్య హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కూడా ఒకరు  మొదట ఈ ముద్దుగుమ్మ తమిళ చిత్రమైన విరాటు అనే సినిమా ద్వారా 2014 వ సంవత్సరంలో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ఆ సమయంలోనే తెలుగులో మిర్చి లాంటి కుర్రాడు అనే చిత్రంలో నటించినా.. ఫెయిల్యూర్ గానే మిగిలిపోయింది. 

వరుణ్ తేజ్ తో నటించిన కంచె సినిమా ఈమె కెరీర్ కు బాగా ఉపయోగపడింది. ఆ తర్వాత ఒక్కసారిగా టాలీవుడ్ లో పాపులారిటీ సంపాదించుకున్న ప్రగ్యా జైస్వాల్ కు ఎన్నో అవకాశాలు వెలువడ్డాయి. కానీ అవేవీ కూడా సక్సెస్ అందించలేకపోయాయి. యంగ్ హీరోలతో నటించిన ప్రగ్యా జైస్వాల్ కి ఈ మధ్యకాలంలో అవకాశాలు పెద్దగా కూడా రాలేదు..దీంతో బాలీవుడ్ వైపుగా అడుగులు వేసిన ఈమె  అక్కడ కూడా బాక్సాఫీస్ వద్ద ఫెయిల్యూర్ గా నిలవడంతో మళ్ళీ  టాలీవుడ్ లోనే ప్రయత్నాలు చేస్తోంది.   

ఇకపోతే బాలయ్య హీరోగా నటించిన అఖండ సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న ఈమెకు.. ఆ తర్వాత అనుకున్నంత స్థాయిలో అవకాశాలు రాలేదు. ఒక సినిమాలలో అవకాశాలు తగ్గడంతో  సోషల్ మీడియాలో యాక్టివ్ గా  వుంటూ పలు రకాల గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ ఉంటుంది. తాజాగా ప్రగ్యా జైస్వాల్ మరో అందమైన బోల్డ్ ఫోటోలను సైతం షేర్ చేసింది. 

ఈసారి గోధుమ రంగు దుస్తులలో తన పై అందాలు.. తైస్ అందాలతో కుర్రకారులను మంత్రముగ్ధుల్ని చేస్తోంది. ఈ అందాలతో సడన్ సర్ప్రైజింగ్ చేసింది ఈ ముద్దుగుమ్మ. కైపెక్కించే కళ్ళతో కుర్రాళ్లకు చెమటలు పట్టిస్తోంది.. ఈ స్థాయిలో అందం ఉన్నప్పటికీ అవకాశాలు మాత్రం పెద్దగా రాబట్టుకోలేదు. తన అమాయకపు చూపులతో కుర్రకారును మంత్రముగ్ధుల్ని చేసేలా ఈ ఫోటోలను షేర్ చేసింది ప్రగ్యా జైస్వాల్. 

ఈ ఫోటోలు చూసిన అభిమానులు కూడా ఈ ఫోటోలలో ప్రగ్యా చాలా క్యూట్ గా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరొకరు టూ బోల్డ్ అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇంత అందంగా ఉన్నా.. టాలీవుడ్ దర్శక నిర్మాతలు అవకాశాలు ఎందుకు ఇవ్వలేదని కూడా అభిమానులు నిలదీస్తున్నారు. ఏదేమైనా తన అంద చందాలతోనే అందర్నీ ఆకట్టుకుంటుంది ప్రగ్యా జైశ్వాల్.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link