Pragya Jaiswal: బ్లూ డ్రెస్‌లో ప్రగ్యా అసలైన బోల్డ్ ఫోటోస్.. కిర్రాక్ పోజుల్లో అందాలు అదుర్స్..
ప్రగ్యా తమిళ ఇండస్ట్రీ ద్వారా ఆమె కెరీర్‌ను ప్రారంభించారు. 'విరాట్టు' సినిమా ద్వారా సినీ కెరీర్ మొదలు పెట్టారు. ఆ తర్వాత తెలుగు సినిమాలో కాస్త రొటీన్ హీరోయిన్ పాత్రలో తెలుగు ఇండస్ట్రీకి కూడా ఆమె నచ్చారు.
ఈ సినిమాకు గాను ప్రగ్యాజైస్వాల్ బెస్ట్ ఫిల్మ్ ఫెయిర్ అవార్డు కూడా అందుకున్నారు. ప్రగ్యా హిందీ సినిమాల్లో కూడా నటించారు.
ఈమె బాలకృష్ణ నటించిన 'అఖండ'లో కూడా నటించారు. ఆచారీ అమెరికా యాత్రలో కూడా నటించి మెప్పించారు.
ప్రగ్యా జైస్వాల్ మధ్యప్రదేశ్‌లో జన్మించారు. ఈమె పూనె లా స్కూల్‌లో విద్యను పూర్తి చేశారు. ఆ తర్వాత సినీ జీవితాన్ని ప్రారంభించారు.
ముఖ్యంగా మిర్చీ లాంటి కుర్రాడు సినిమాలో కూడా ఈమె నటించింది. ఇక జయ జానకీ నాయక సినిమాలో ఈమె ఐటెం సాంగ్‌లో కనిపించారు.
కంచె సినిమాకు గాను ప్రగ్యా జీ తెలుగు అప్సరా అవార్డు, టీవీ9 నేషనల్ ఫిల్మ్ అవార్డు, సినీమా అవార్డు కూడా పొందారు.
అఖండ సినిమాకు సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డు కూడా గెలుచుకున్నారు.
ప్రగ్యాకు క్రికెటర్ శుభ్ మాన్ గిల్ అంటే ఇష్టమని చెప్పింది. అతనితో డేటింగ్ కూడా చేయాలనుకుంటున్నా అని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.
బాలీవుడ్ 'ఖేల్ ఖేల్ మే' చిత్రంలో అక్షయ్ కుమార్‌తోపాటు ఈ సినిమాలో నటించింది ప్రగ్యా జైస్వాల్ ఇందులో వాణి కపూర్, తాప్సీ కూడా ఉన్నారు.
ఇక ప్రస్తుతం ట్రెండ్ అవుతున్న బ్లూ డ్రెస్‌లో ప్రగ్యా పూర్తి అందాలను ఆరబోసింది. ఈ డ్రెస్‌పై కేవలం సీజెడ్ స్టోన్ కమ్మలు, చేతికి ఉంగరాలు ధరించింది. ఇక హెయిర్ స్టైల్ విషయానికి వస్తే పైకి బన్ వేసుకుంది.