Trump - PM Modi: నమస్తే ట్రంప్.. మరోసారి హౌడీ, మోడీ..!
Trump - PM Modi: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మరోసారి విజయానికి చేరువయ్యారు. దీంతో భారత్ అమెరికా మధ్య సంబంధాలు మరింత మెరుగవుతాయని అభిప్రాయపడుతున్నారు విశ్లేషకులు. గతంలో ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న టైంలో....టెక్సాస్ లోని హౌడీ మోడీ, నమస్తే ట్రంప్ వంటి కార్యక్రమాల్లో పాల్గొన్నారు.
ఇరు దేశాలు మంచి సంబంధాలు కొనసాగించాయి. ఇక్కడ కూడా ప్రధానిగా మోడీ మూడో సారి విజయం సాధించారు. ఇదే టైంలో ప్రస్తుత ఎన్నికల్లో ట్రంప్ విజయం సాధించడం దాదాపు ఖరారైంది. దీంతో మళ్లీ పాత రోజులు రిపీట్ అవుతాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
ఈ నేపథ్యంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా గెలవడం దాదాపు ఖరారు కావడంతో తన ఫ్రెండ్ మరోసారి అధ్యక్షుడిగా ఎన్నిక కావడంతో ఆయనకు విషెస్ చెబుతూ ట్రంప్ తో గతంలో దిగిన ఫోటోలను షేర్ చేసుకున్నారు. ప్రపంచ శాంతి కోసం ఇద్దరం పాటుపడదామని చెప్పారు. గతంలో లాగే భారత్ - అమెరికా సంబంధాలు మరింత బలోపేతం చేసుకునే దిశగా అడుగులు వేయాలన్నారు.
ఇక అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రతిపక్ష నేతగా ఉండి.. మళ్లీ అధ్యక్షుడిగా ఎన్నికైన నేతగా డొనాల్డ్ ట్రంప్ రికార్డు క్రియేట్ చేసారు. గతంలో 1892లో రెండోసారి ప్రెసిడెంట్ గా గ్రోవర్ క్లీవ్ ల్యాండ్ గెలిచారు. ఆ తర్వాత ఇన్నేళ్లుకు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత ప్రతిపక్ష స్థానానికి పరిమితమయ్యారు.
తిరిగి ఇపుడు మళ్లీ ట్రంప్ అధ్యక్షుడిగా గెలవడం రికార్డు అని చెబుతున్నారు. అంతేకాదు ఎన్నికల సమయంలో బంగ్లాదేశ్ లో హిందువులపై జరిగిన ఊచకోతను ఖండించి హిందూ ఓటర్ల మనసులను గెలుచుకున్నారు.
రెండు సార్లు ట్రంప్ మహిళలపై గెలవడం విశేషం. తొలిసారి హిల్లరీ క్లింటన్ పై గెలిచిన ట్రంప్.. తాజాగా ఇపుడు కమల్ హారిస్ పై విజయం సాధించడం విశేషం. మొత్తంగా అమెరికా అధ్యక్ష ఎన్నిక బరిలో మూడోసార్లు పోటీ చేసి రెండు సార్లు గెలిచి రికార్డు క్రియేట్ చేసారు ట్రంప్.
తాజాగా ట్రంప్ విజయంతో భారత్, అమెరికా సంబంధాలు మెరుగవుతాంటున్న రాజకీయ విశ్లేషకులు. అంతేకాదు రష్యా, ఉక్రెయిన్ యుద్ధం, ఇజ్రాయిల్, పశ్చిమాసియాలో యుద్దాలకు ముగింపు పలకవచ్చని చెబుతున్నారు.