Priyanka Chopra Pics: హాట్ అందాలతో హీటెక్కిస్తున్న ప్రియాంక చోప్రా.. వయస్సు పెరుగుతున్నా తరగని అందం!

Thu, 03 Nov 2022-8:52 pm,

సోషల్ మీడియాలో చురుగ్గా ఉండే ప్రియాంక చోప్రా ఎప్పటికప్పుడు తన ఫొటోస్ పోస్ట్ చేస్తూ అభిమానులను అలరిస్తుంటారు. తాజాగా పీసీ వైట్ డ్రెస్సులో అందాలు ఆరబోశారు.   

హాలీవుడ్ గాయకుడు నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా.. అక్కడే సెటిల్ అయ్యారు. సరోగసి పద్ధతిలో ప్రియాంక, నిక్‌ దంపతులు పండంటి బిడ్డకు జన్మనిచ్చిన విషయం తెలిసిందే.   

బాలీవుడ్ కెరీర్ మంచి ఊపులో ఉండగానే హాలీవుడ్ వెళ్లిన ప్రియాంక చోప్రా.. గ్లోబల్ స్టార్ అయ్యారు. అక్కడ వరుసగా సినిమాలు చేస్తూ ప్రపంచ స్థాయి గుర్తింపు తెచ్చుకున్నారు.  

ఐత్రాజ్, ముజ్సే షాది కరోగి, క్రిష్, డాన్ సినిమాలతో పాపులర్ అయిన ప్రియాంక చోప్రా.. ఫ్యాషన్ చిత్రంతో తన నట విశ్వరూపం చూపారు. దోస్తానా, బిల్లూ, కమీనే, బర్ఫీ లాంటి హిట్ సినిమాలు ప్రియాంక ఖాతాలో ఉన్నాయి.   

2003లో వచ్చిన 'లవ్ స్టొరీ ఆఫ్ ఎ స్పై' ద్వారా ప్రియాంక చోప్రా బాలీవుడ్ రంగప్రవేశం చేశారు. అందాజ్ చిత్రం ద్వారా ఆమెకు తొలి విజయం లభించింది.   

 2000వ సంవత్సరంలో ప్రియాంక చోప్రా ప్రపంచ సుందరి కిరీటాన్ని చేజిక్కించుకున్నారు. ఆపై తమిళన్ (2002) అనే తమిళ సినిమా ద్వారా నటన జీవితం ప్రారంభించారు.   

1982 జూలై 18న జంషడ్ పూర్‌లో ప్రియాంక చోప్రా జన్మించారు. లక్నోలోని లా మార్టినీయర్ పాఠశాలలో విద్యాభ్యాసం చేశారు. పై చదువుల కోసం యూఎస్ వెళ్లారు.   

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link