Shashi Dhiman In IPL 2023: పంజాబ్ కింగ్స్ జట్టుతో ఉన్న ఈ యువతి ఎవరో తెలుసా ?
Who is Shashi Dhiman: పంజాబ్ కింగ్స్ జట్టు ఆడే ప్రతి మ్యాచ్‌లోనూ స్టేడియంలో సందడి చేసే ఈ మిస్టరీ గాళ్ పేరు శశి ధీమాన్. శశి ధిమాన్ పంజాబ్ కింగ్స్ జట్టుకు సంబంధించిన సోషల్ మీడియా పేజీలకు యాంకరింగ్ చేస్తోంది.
Who is Shashi Dhiman: శశి ధీమాన్ పంజాబ్ కింగ్స్ యూట్యూబ్ ఛానెల్, ఇన్‌స్టాగ్రామ్ వీడియోలు, రీల్స్ చేస్తూ ఎప్పటికప్పుడు జట్టుకు సంబంధించిన అప్‌డేట్స్‌తో నెటిజెన్స్‌ని ఆకట్టుకుంటోంది. అంతేకాకుండా, పంజాబ్ కింగ్స్ జట్టు ప్రీ మ్యాచ్, పోస్ట్ మ్యాచ్ వీడియోలపై కూడా శశి ధిమాన్ యాంకర్ చేస్తూ హైలైట్స్ వివరిస్తోంది. పంజాబ్ జట్టులోని బలాబలాలనూ వెల్లడిస్తూ అందరి దృష్టి మ్యాచ్‌పై పడేలా చేస్తోంది.
Who is Shashi Dhiman: శశి ధీమాన్ స్వస్థలం చండీగఢ్. శశి ధిమాన్ 2020 నుండి ముంబైలో నివసిస్తోంది. శశి ధీమాన్ యాంకరింగ్ చేయడాని కంటే ముందుగా స్టాండప్ కమెడియన్‌గా చేసింది. శశి గతంలో కూడా తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో స్టాండప్ కామెడీకి సంబంధించిన అనేక వీడియోలను షేర్ చేసుకుంది.
Who is Shashi Dhiman: మెడికల్ సైన్స్‌లో విద్యాభ్యాసం పూర్తి చేసిన శశి ధీమాన్.. వృత్తిరీత్యా ఫార్మా సైంటిస్ట్. గతేడాది నుంచి ఆమె పంజాబ్ కింగ్స్‌తోనే తన కెరీర్ కొనసాగిస్తోంది. మ్యాచ్ ముగిసిన అనంతరం ఆమె ఆటగాళ్లతోనూ ఇంటర్వ్యూలు చేస్తూ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పంజాబ్ కింగ్స్ జట్టు ఎంగేజ్మెంట్ పెరిగేలా చేస్తోంది.
Who is Shashi Dhiman: శశి ధీమాన్‌కి పంజాబీ బాగా వస్తుంది. అదే ఆమెకు ప్లస్ పాయింట్ అయింది. పంజాబీలో ఆటగాళ్లతో మాట్లాడి ఆకట్టుకుంటుంది. గత మూడు, నాలుగేళ్లుగా శశి స్టాండప్ కామెడీ చేస్తోంది. ఢిల్లీ, గుర్‌గావ్, జైపూర్, బాంద్రా, థానేలో స్టాండప్ కామెడి షోలు చేసి ఆకట్టుకుంది.