Pushpa 2 Hindi Day 1 Net Collections: ‘పుష్ప 2’ సహా ఫస్ట్ డే హిందీలో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాలు..
అవును తెలుగు సినిమాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను దున్నేస్తున్నాయి. బాహుబలితో మొదలైన ఈ మేనియా పుష్ప 2 తో కంటిన్యూ అవుతూనే ఉంది. అప్పట్లో బాహుబలి 2.. ఆ తర్వాత కేజీఎఫ్ 2.. ఇపుడు పుష్ప 2 ది రూల్ నిజంగా బాలీవుడ్ బాక్సాఫీస్ ను రూల్ చేస్తూనే ఉంది.
1.పుష్ప 2 ది రూల్ - Pushpa 2 The Rule
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన చిత్రం పుష్ప 2 ది రూల్. ఈ సినిమా హిందీలో ఫస్ట్ డే మన దేశంలో రూ. 72 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 1లో నిలిచింది.
2. జవాన్ - Jawan షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ మూవీ మన దేశంలో ఫస్ట్ డే రూ. 65.50 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది. తాజాగా పుష్ప 2 రాకతో నెంబర్ వన్ ప్లేస్ నుంచి నెంబర్ 2 ప్లేస్ లోకి వచ్చి చేరింది.
3.స్త్రీ 2 - Stree 2 శ్రద్ధా కపూర్ హీరోయిన్ గా నటించిన లేడీ ఓరియండెట్ మూవీ ‘స్త్రీ 2’. ఈ మూవీ హందీ బాక్సాఫీస్ దగ్గర మొదటి రోజు రూ. 55.40 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టింది.
4. పఠాన్ - Pathaan
షారుఖ్ హీరోగా యశ్ రాజ్ ఫిల్మ్స్ పతాకంపై సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరెక్కిన ‘పఠాన్’ మూవీ తొలి రోజు మన దేశంలో రూ. 55 కోట్ల నెట్ వసూళ్లతో తాజాగా 4వ స్థానంలో నిలిచింది.
5. యానిమల్ - Animal
రణ్ బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘యానిమల్’. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు రూ. 54.75 కోట్ల నెట్ వసూళ్లతో తాజాగా లెక్కల ప్రకారం 5వ ప్లేస్ లో ఉంది.
6.కేజీఎఫ్ 2 - KGF 2
ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో యశ్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ 2’ మూవీ .. హిందీ బాక్సాఫీస్ దగ్గర తొలి రోజు మన దేశంలో రూ. 53.95 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి 6వ స్థానంలో నిలిచింది.
7. థగ్స్ ఆఫ్ హిందూస్థాన్ - Thugs Of Hindustan
అమితాబ్ బచ్చన్, ఆమీర్ ఖాన్ హీరోలుగా తెరకెక్కిన మూవీ ‘థగ్స్ ఆఫ్ హిందూస్థాన్’. ఈ సినిమా హిందీలో తొలి రోజు మన దేశంలో రూ 50.75 కోట్ల వసూళ్లతో టాప్ 7లో నిలిచింది.
8. వార్ - War
హృతిక్ రోషన్, టైగర్ ఫ్రాఫ్ హీరోలుగా సిద్ధార్ధ్ ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘వార్’. ఈ మూవీ హిందీ బాక్సాఫీస్ దగ్గర మన దేశంలో ఫస్డ్ డే రూ. 51.60 కోట్ల నెట్ వసూళ్లతో తాజా ర్యాగింగ్స్ లో నెంబర్ 8లో ఉంది.