Hindi Dubbed South movies top day 1 Collections: ‘పుష్ప 2’ సహా సౌత్ డబ్బింగ్ మూవీస్ లో టాప్ డే 1 కలెక్షన్స్ సాధించిన చిత్రాలు ఇవే..
Hindi Dubbed South movies top day 1 Collections: తెలుగు సహా పలు సౌత్ డబ్బింగ్ చిత్రాలు హిందీ బాక్సాఫీస్ ను రూల్ చేస్తున్నాయి. బాహుబలి సహా మిగతా చిత్రాలు బాలీవుడ్ బాక్సాఫీస్ ను ఏలాయి. తాజాగా పుష్ప 2 చిత్రం బాలీవుడ్ బాక్సాఫీస్ సింహాసనంపై కూర్చొబెట్టింది. మొత్తంగా హిందీ డబ్బింగ్ చిత్రాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన చిత్రాల విషయానికొస్తే..
1.పుష్ప 2 ది రూల్ - Pushpa 2 The Rule
సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో తెరకెక్కిన భారీ చిత్రం ‘పుష్ప 2 ది రూల్’. ఈ సినిమా హిందీలో ముఖ్యంగా డబ్బింగ్ చిత్రాల్లో ఫస్ట్ డే మన దేశంలో రూ. 72 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 1లో నిలిచింది.
2.కేజీఎఫ్ 2 - KGF 2..
యశ్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో తెరకెక్కిన చిత్రం ‘కేజీఎఫ్ 2’. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ 2’ మూవీ .. హిందీ బాక్సాఫీస్ దగ్గర డబ్బింగ్ చిత్రాల్లో ఫస్ట్ డే మన దేశంలో రూ. 53.95 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి 2వ స్థానంలో నిలిచింది.
3.బాహుబలి 2
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2’. ఈ సినిమా అప్పటి వరకు బాలీవుడ్ లో డబ్బైన చిత్రాల్లో మొదటి రోజు అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రాల్లో టాప్ లో నిలిచింది. అప్పట్లోనే మొదటి రోజు రూ. 41 కోట్ల వసూళ్లను సాధించి ప్రస్తుతం టాప్ 3లో ఉంది.
4.ఆదిపురుష్ ప్రభాస్ శ్రీరాముడిగా ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఆదిపురుష్’. ఈ సినిమా హిందీలో తొలి రోజు రూ. 37.25 కోట్ల నెట్ వసూళ్లతో టాప్ 4లో కొనసాగుతోంది.
5.సాహో
ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సాహో’. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర మన దేశంలో ఫస్ట్ డే రూ. 24.4 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన టాప్ 5లో ఉంది.
6. కల్కి 2898 AD..
రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ సినిమా హిందీ బాక్సాఫీస్ దగ్గర రూ. 22.50 కోట్ల నెట్ వసూళ్లను సాధించి టాప్ 6లో నిలిచింది.
7.RRR
రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘ఆర్ఆర్ఆర్’ (రౌద్రం రణం రుధిరం). ఈ సినిమా హిందీలో తొలి రోజు రూ. 20.07 కోట్ల నెట్ వసూళ్లను సాధించింది.
8.2.O శంకర్ దర్శకత్వంలో రజినీకాంత్, అక్షయ్ కుమార్ హీరోలుగా తెరకెక్కిన చిత్రం ‘2.O’. ఈ సినిమా ఫస్ట్ డే డబ్బింగ్ చిత్రాల్లో తొలి రోజు రూ. 19.74 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టి టాప్ 8లో నిలిచింది.
9. సలార్
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సలార్’. ఈ సినిమా హిందీ డబ్బింగ్ చిత్రాల్లో తొలి రోజు రూ. 15.75 కోట్ల న ట్ వసూళ్లతో టాప్ 9లో నిలిచింది.
10.దేవర.. ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘దేవర’. ఈ సినిమా హిందీలో విడుదలైన సౌత్ డబ్బింగ్ చిత్రాల్లో తొలి రోజు రూ. 7.95 కోట్ల నెట్ వసూళ్లను సాధించి టాప్ 10లో చోటు సంపాదించుకుంది.