Pushpa 2: పుష్ప2 మూవీ చూడాలనుకునే ప్రేక్షకులకు బంపర్ ఆఫర్.. సగం ధరకే ఇలా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు..
పుష్ప2 మూవీ చూడాలని ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మాత్రమే కాదు సినీ ప్రియులు కూడా ఎదురు చూస్తున్నారు. ఈ ప్యాన్ ఇండియా సినిమా రేపు డిసెంబర్ 5వ తేదీన విడుదల కానుంది. అయితే, ఈ సినిమా టిక్కెట్లు భారీగా పెరిగాయి రూ.500 పైగా ఒక్కో టిక్కెట్ కూడా ఉంది.
ఈ టిక్కెట్‌పై 50 శాతం రాయితీ ఎలా పొందాలి తెలుసా? 'బుక్ మై షో' యాప్ లేదా వెబ్‌సైట్ ద్వారా టిక్కెట్ బుక్ చేసుకోవచ్చు. ముఖ్యంగా 2డీ, 3డీ, ఐమ్యాక్స్ వంటి మల్టిప్లెక్సలకు ఆఫర్లను ఇస్తుంది. అంతేకాదు షో సమయాన్ని బట్టి ధర మారుతుంది.
మీ వద్ద ఉన్న క్రెడిట్ లేదా డెబిట్ కార్డులు ఉపయోగించి 50 శాతం ఆదా చేయవచ్చు. పే టీఎం కూడా స్పెషల్ ప్రమోషన్ ఆఫర్స్ ఇస్తుంది. యాక్సీస్ బ్యాంక్ మై జోన్ క్రెడిట్ కార్డు ద్వారా కూడా మీరు డబ్బులు ఆదా చేయవచ్చు.
డిస్ట్రిక్ యాప్ ఇది జొమాటోతో లింక్ అయి ఉంది. ఇది కూడా సినిమా టిక్కెట్లపై ప్రత్యేక రాయితీలను అందిస్తుంది. ఇది కాకుండా మీరు 'బ్లింకిట్' లో రూ.999 షాపింగ్ చేస్తే మీరు రూ.200 వోచర్ పొందుతారు.
ఈ వోచర్ ఉపయోగించి కూడా మీరు పుష్ప2 మూవీ టిక్కెట్లను బుక్ చేసుకోవచ్చు. మీ డబ్బులు ఎక్కువ పోగొట్టుకోకుండానే ఈ మూవీ చూసేయండి.
ప్యాన్ ఇండియా లెవల్‌లో విడుదల అవుతున్న ఈ సినిమాలో అల్లు అర్జున్ హీరోగా నటించగా, రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించారు.