Pushpa2: బాలీవుడ్ లో తొలి రూ. 100 కోట్ల నెట్ వసూళ్ల నుంచి రూ. 700 కోట్ల వసూళ్లు సాధించిన చిత్రాలు ఇవే..

Wed, 25 Dec 2024-11:15 am,

ఈ నేపథ్యంలో బాలీవుడ్ లో ఫస్ట్ రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రం నుంచి ఫస్ట్ రూ. 200 కోట్లు.. తాజాగా పుష్ప 2 బాలీవుడ్ రూ. 700 కోట్ల నెట్ వసూళ్లను  సాధించిన సినిమాలు ఏమేమి ఉన్నాయంటే..

 

గజిని (2008).. ఆమీర్ ఖాన్ హీరోగా అల్లు అరవింద్ నిర్మాణంలో ఏఆర్ మురుగదాస్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘గజిని’. హిందీలో తొలి రూ. 100 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన తొలి చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.

 

3 ఇడియట్స్ (2009).. ఆమీర్ ఖాన్, మాధవన్, శర్మన్ జోషి హీరోలుగా రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘3 ఇడియట్స్’. ఈ సినిమా మన దేశంలో తొలి రూ. 200 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది.  రూ. 100 కోట్ల నుంచి రూ. 200 కోట్ల మార్క్ అందుకోవడానికి యేడాది సమయమే పట్టింది.

 

ఫస్ట్ రూ. 300 కోట్ల నెట్ వసూళ్లు..

పీకే (2014)..ఆమీర్ ఖాన్ హీరోగా సుశాంత్ సింగ్ రాజ్ పుత్, సంజయ్ దత్ ముఖ్యపాత్రల్లో రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పీకే’. ఈ సినిమా హిందీలో తొలి రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా సరికొత్త హిస్టరీని క్రియేట్ చేసింది. ఇక రూ.200 కోట్ల నుంచి రూ. 300 కోట్ల నెట్ వసూళ్లను రాబట్టడానికి ఐదేళ్ల సమయం పట్టింది.

బాహుబలి 2 (2017).. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘బాహుబలి 2’. ఈ సినిమా మన దేశంలో హిందీ వెర్షన్ లో తొలి రూ. 400 కోట్ల నెట్ వసూళ్లతో పాటు ఫస్ట్ రూ. 500 కోట్ల నెట్ వసూళ్లను క్రాస్ చేయడం విశేషం. ఈ రెండు మైలు రాళ్లను అందుకోవడానికి మూడేళ్ల సమయం పట్టింది. ఒకే సినిమా రెండు రికార్డులను బ్రేక్ చేసింది. అంతేకాదు ఒక ప్రాంతీయ భాష చిత్రం హిందీలో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం అదే ప్ర ప్రథమం అని చెప్పాలి.

స్త్రీ 2 (Stree 2 -2024).. శ్రద్ధా కపూర్ లీడ్ రోల్లో తమన్నా, రాజ్ కుమార్ రావు ముఖ్య పాత్రల్లో నటించిన చిత్రం ‘స్త్రీ 2’. అమర్ కౌశిక్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా హిందీలో తొలి రూ. 600 కోట్ల నెట్ వసూళ్లను సాధించిన చిత్రంగా ఇండస్ట్రీ హిట్ నిలిచింది. ఓ లేడీ ఓరియంటెడ్ మూవీ బాలీవుడ్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలవడం విశేషం. రూ. 400 .. రూ. 500 కోట్ల నుంచి రూ. 600 కోట్ల నెట్ వసూళ్లను  సాధించడానికి 7 యేళ్లు పట్టింది.

పుష్ప 2 (2024).. బాలీవుడ్ లో రూ. 600 కోట్ల నెట్ వసూళ్ల నుంచి రూ. 700 కోట్ల నెట్ వసూళ్లను సాధించడానికి కేవలం మూడు నెలల గ్యాప్ లోనే ఈ రికార్డు అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప 2’ సాధించింది. అంతేకాదు మన దేశంలో హిందీ వెర్షన్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అయితే ఈ సినిమా రూ. 800 కోట్ల నెట్ వసూళ్లను సాధించి మరో మైలు స్టోన్ ను అధిగమిస్తుందా లేదా అనేది చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link