Tollywood Highest Pre Release Business Movies: టాలీవుడ్ లో ఎక్కువ ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన చిత్రాలు.. ‘పుష్ప 2’ ప్లేస్ ఎక్కడంటే..
పుష్ప 2 ది రూల్ ..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘పుష్ప 2 ది రూల్’. పుష్ప పార్ట్ 1కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. అందుకే ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా అదే రేంజ్ లో ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అందులోను రికార్డు నెలకొల్పింది. ఈ సినిమా తెలుగులోనే రూ. 213 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ. 617 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేయడం మైండ్ బ్లాంక్ చేస్తోంది.
RRR.. ఎన్టీఆర్, రామ్ చరణ్ కథానాయకులుగా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ తెలుగు రాష్ట్రాల్లో పుష్ప 2 ముందు వరకు రికార్డు స్థాయిలో రూ.191 కోట్ల బిజినెస్ చేసింది. ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ. 451 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తాజాగా పుష్ప 2 రాకతో రెండో ప్లేస్ లో నిలిచింది.
కల్కి 2898 AD.. ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘కల్కి 2898 AD’. ఈ చిత్రం తెలుగు రాష్ట్రాల్లో రూ. 168 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ సినిమావరల్డ్ వైడ్ గా రూ. 370 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
బాహుబలి 2.. రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా రాజమౌళి హీరోగా నటించిన ‘బాహుబలి 2’ సినిమా తెలుగు రాష్ట్రాల్లో అప్పట్లోనే రూ. 122 కోట్ల బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 352 కోట్ల ప్రీ రిలీజ్ చేయడం విశేషం.
సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్.. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన చిత్రం ‘సలార్ పార్ట్ -1 సీజ్ ఫైర్’ తెలుగు రాష్ట్రాల్లో రూ. 145 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. వరల్డ్ వైడ్ గా రూ. 345 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.
సాహో.. సుజిత్ దర్శకత్వంలో రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘సాహో’. ఈ చిత్రం తెలుగు స్టేట్స్ లో రూ. 121.6 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా రూ. 270 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది.