PV Sindhu: ఘనంగా పీవీ సింధు పెళ్లి.. ఉదయ్‌పూర్ వేదికగా వెంకట దత్తతో ఏడడుగులు..గెస్టులు ఎవరొచ్చారంటే..?
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి వివాహం నిన్న 22న ఆదివారం ఉదయ్‌పూర్ వేదికగా అత్యంత సన్నిహితుల మధ్య ఘనంగా జరిగింది. పోసిడెక్స్ టెక్నాలజీస్ ఎగ్జిక్యూటీవ్ డెరెక్టర్ వెంటక దత్తతో ఈమె ఏడడుగులు వేశారు.
ఆదివారం రాత్రి 11.20 సమయంలో జరిగింది. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. అయితే, ఈ పెళ్లికి సంబంధించిన ఫోటోలు ఇంకా బయటకు రాలేవు.
రేపు 24వ తేదీ వీరి రిసెప్షన్ హైదరాబాద్‌లో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. పెళ్లి 140 మంది అతిథుల నడుమ జరిగినట్లు తెలుస్తోంది. అయితే, రిసెప్షన్‌కు సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
డిసెంబర్ 20న పీవీ సింధు సంగీత్ వేడుకలు జరిగాయి. ఆ తర్వాత రోజు హల్దీ, పెళ్లి కూతురు, మెహందీ వేడుకలు నిర్వహించారు. చివరిసారిగా సింధు బ్యాడ్మింటన్ వరల్డ్ ఫెడరేషన్‌లో ఆడింది. సింధు చైనా లూయో యూ ను 21-14, 21-16 తేడాతో గెలిచింది.
సింధు కెరీర్‌లో bwf వరల్డ్ ఛాంపియన్‌షిప్, రియో ఒలింపిక్స్ , టోక్యో ఒలింపిక్స్‌లో మెడల్స్ సాధించింది. ఈ నెలలోనే సింధు నిశ్చితార్థం వేడుకలు నిర్వహించారు. తన కుటుంబానికి సన్నిహితుడు అయిన వెంకట దత్తను సింధు పెళ్లి చేసుకున్నారు.