PV Sindhu: పెళ్లి చేసుకోబోతున్న బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు.. వరుడు ఎవరో తెలుసా?
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ పీవీ సింధు గురించిన ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈమె రెండు సార్లు ఒలింపిక్ పథకాలను గెలిచిన సంఘ తెలిసిందే. ఇది ఇలా ఉండగా పీవీ సింధు పెళ్లి చేసుకోబోతుంది.
బిజినెస్‌మెన్ వెంకట దత్త అనే వ్యక్తితో ఏడు అడుగులు వేయనుంది. ఈనెల 22న ఉదయపూర్ వేదికగా అంగరంగ వైభవంగా ఆమె పెళ్లి జరగనుంది... ఆ తర్వాత 24న హైదరాబాద్ లో రిసెప్షన్ భారీ ఎత్తున నిర్వహించనున్నారు.
ఇక పీవీ సింధు పెళ్లి చేసుకోబోతున్న వెంకట దత్త వారి కుటుంబానికి సన్నిహితుడు. ఎప్పటినుంచో అనుబంధం కలిగి ఉంది అని పీవీ సింధు తండ్రి చెప్పారు. ఈ సందర్భంగా వీరి పెళ్లి వేడుకలు అతి త్వరలో ప్రారంభం కానున్నాయి.
ఇక వెంకట దత్త పోసిడెక్స్ టెక్నాలజీస్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా పని చేస్తున్నారు. అయితే పీవీ సింధు జనవరి నెలలో కూడా వరుసగా టోర్నీలు ఆడాల్సి ఉంది.
దాదాపు రెండున్నర ఏళ్ల తర్వాత ఆదివారం జరిగిన బి డబ్ల్యు ఎఫ్ టైటిల్ పోరుకు తీసింది ఈమె టోర్నీ విజేతగా గెలిచిన సంగతి తెలిసింది. ఆ మరుసటి రోజు పీవీ సింధు పెళ్లి విషయమై గుడ్ న్యూస్ చెప్పింది