Raashii Khanna: హల్దీ సెలబ్రేషన్స్ జరుపుకున్న రాశి ఖన్నా.. ఆకట్టుకుంటున్న ఫొటోస్
నాగశౌర్య హీరోగా చేసిన ఊహలు గుసగుసలాడే సినిమాతో మనకు పరిచయమైన నటి రాశి ఖన్నా. మొదటి సినిమాతోనే మంచి విజయం అందుకున్న ఈ హీరోయిన్ ఆ తరువాత అక్కినేని మూడు తరాలు నటించిన మనం చిత్రంలో ఒక చిన్న పాత్రలో కనిపించింది.
మొదట్లో కొంచెం బొద్దుగా ఉండే ఈ హీరోయిన్ రాను.. రాను చాలా సన్నగా అయిపోయి యువతను సైతం ఎక్కువగా ఆకట్టుకోవడం మొదలుపెట్టింది.
తెలుగు చిత్రాలలోనే కాకుండా తమిళ సినిమాలలో కూడా ఎన్నో అవకాశాలు దక్కించుకుంది. తెలుగులో సుప్రీం, హైపర్, జై లవకుశ, ఆక్సిజన్, టచ్ చేసి చూడు లాంటి చిత్రాలలో నటించింది.
వరుణ్ తేజ్ హీరోగా చేసిన తొలిప్రేమ చిత్రంతో సూపర్ హిట్ సినిమాని తన ఖాతాలో వేసుకుంది ఈ హీరోయిన్. ఈ మధ్యనే ఫర్జీ వెబ్ సిరీస్ లో కనిపించిన రాశి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం అందరిని ఆకట్టుకుంటున్నాయి.
మెరిసిపోయే పంజాబీ డ్రెస్ లో హల్దీ ఫంక్షన్ ఎంజాయ్ చేస్తూ.. తన ఫ్యామిలీ, ఫ్రెండ్స్ తో ఈ ఫోటోలు షేర్ చేసింది ఈ నటి.