Raashii Khanna: తెలుగులో ఛాన్సులు లేక పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోన్న రాశి ఖన్నా..

Tue, 23 Apr 2024-1:33 pm,

రాశి ఖన్నా.. తెలుగులో తనదైన శైలిలో రాణించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు ఎదగలేకపోయింది. అందుకే పక్క ఇండస్ట్రీ వైపు చూపులు చూస్తోంది.  

తెలుగులో ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' తప్పించి మిగతా టాలీవుడ్ బడా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం ఈ అమ్మడికి ఛాన్సులు దక్కలేదు.

రాశి ఖన్నా.. కేవలం సినిమాలు మాత్రమ కాదు.. వెబ్ సిరీస్‌లో కూడా అలరించింది. అజయ్ దేవ్‌గణ్ 'రుద్ర'తో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిన 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో ప్యాన్ ఇండియా లెవల్లో అదరగొట్టేసింది. 

2013లో రాశీ ఖన్నా జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన 'మద్రాస్ కేఫ్‌' మూవీతో కథానాయికగా పరిచయమైంది. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో తెలుగులో ఎంట్రీ ఇచ్చింది. అంతకు ముందు మనం సినిమాలో చిన్న పాత్ర చేసింది రాశీ ఖన్నా.

రాశీ ఖన్నా ఈ మధ్య ఓ యూట్యూబ్‌ ఛానెల్ ప్రారంభించింది. అంతేకాదు అందులో తనకు సంబంధించిన విషయాలను పంచుకుంటూ అభిమానులకు దగ్గరయ్యింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link