Raashii Khanna: ప్యాంట్ షర్టులో అందాల హద్దులు చెరిపేస్తోన్న రాశి ఖన్నా.. లేటస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..
రాశి ఖన్నా.. తెలుగులో తనదైన శైలిలో దూసుకుపోతుంది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు కాస్త దూరంలో ఆగిపోయింది ఈ భామ. అందుకే పక్క ఇండస్ట్రీ వైపు చూస్తోంది.
రాశి ఖన్నా.. కేవలం సినిమాల్లో మాత్రమే కాదు.. వెబ్ సిరీస్‌లో కూడా అలరించింది. అజయ్ దేవ్‌గణ్ 'రుద్ర'తో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిన 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో ప్యాన్ ఇండియా లెవల్లో చెలరేగిపోతుంది.
తెలుగులో 'ఊహాలు గుసగుసలాడే' మూవీతో పరిచయమైన రాశీ.. ఆ తర్వాత గోపీచంద్‌తో చేసిన 'జిల్'చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకుల మనసును దోచుకుంది.జిల్ తర్వాత గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' సినిమాలో నటించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేక పోయింది.
టాలీవుడ్ లో ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' తప్పించి మిగతా టాలీవుడ్ బడా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం రాశీ ఖన్నాకు సరైన ఛాన్సులు దక్కలేదనే చెప్పాలి.
నాగ చైతన్య సరసన విక్రమ్ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన 'థాంక్యూ' మూవీ రాశీ ఖన్నాకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది. ప్రస్తుతం తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమిళం, హిందీ సినిమాలపై ఫోకస్ పెడుతోంది.
2013లో రాశీ ఖన్నా జాన్ అబ్రహం హీరోగా తెరకెక్కిన 'మద్రాస్ కేఫ్' చిత్రంలో హీరోయిన్ గా పరిచయమైంది. ఆ తర్వాత నాగ శౌర్య హీరోగా నటించిన 'ఊహలు గుసగుసలాడే' మూవీతో తెలుగులో తెరంగేట్రం చేసింది. అంతకు ముందు అక్కినేని హోల్ సేల్ గా నటించిన ‘మనం’ సినిమాలో చిన్న పాత్ర చేసింది రాశీ ఖన్నా. ప్రస్తుతం సొంతంగా ఓ యూట్యూబ్ ఛానెల్ ఓపెన్ చేసింది.