Raashii Khanna: చీరకట్టులో సన్నజాజి తీగలా రాశి ఖన్నా.. లేటస్ట్ పిక్స్ చూస్తే చూపు తిప్పుకోలేరేమో..

Fri, 18 Oct 2024-7:15 am,

రాశి ఖన్నా.. తెలుగులో తనదైన శైలిలో మెప్పించింది. కానీ స్టార్ హీరోయిన్ రేంజ్‌కు కాస్త దూరంలో ఆగిపోయింది. అందుకే వేరే  ఇండస్ట్రీ వైపు చూస్తోంది.

రాశి ఖన్నా.. కేవలం సినిమాలను  మాత్రమే నమ్ముకోలేదు. వెబ్ సిరీస్‌లో కూడా అలరించింది. అజయ్ దేవ్‌గణ్ 'రుద్ర'తో పాటు రాజ్ అండ్ డీకే తెరకెక్కిన 'ఫర్జీ' వెబ్ సిరీస్‌లతో ప్యాన్ ఇండియా లెవల్లో ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకుంది. 

రాశీ ఖన్నా 'ఊహాలు గుసగుసలాడే' మూవీతో పరిచయమైన ఈ భామ.. ఆ తర్వాత గోపీచంద్‌తో చేసిన 'జిల్'చిత్రంతో  టాలీవుడ్  ప్రేక్షకుల మనసును దోచుకుంది.జిల్ తర్వాత గోపీచంద్ సరసన 'పక్కా కమర్షియల్' సినిమాలో నటించింది. మారుతి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా పెద్దగా మెప్పించలేక పోయింది. 

తెలుగులో ఎన్టీఆర్‌తో 'జై లవకుశ' తప్పించి మిగతా టాలీవుడ్ బడా స్టార్ హీరోల సినిమాల్లో మాత్రం రాశీ ఖన్నాకు ఛాన్సులు దక్కలేదు.

 విక్రమ్ కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్యకు జోడిగా నటించిన 'థాంక్యూ' మూవీ రాశీ ఖన్నాకు చేదు జ్ఞాపకాన్ని మిగిల్చింది.  ప్రస్తుతం తెలుగు సినిమాలకు బ్రేక్ ఇచ్చి తమిళం, హిందీ సినిమాలపై ఫోకస్ పెడుతోంది.

 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link