Pooja Hegde Black and white Pics: బ్లాక్ అండ్ వైట్ ఫొటోలతో పూజా హెగ్దే హంగామా.. ట్రెండీ వేర్‌లో గ్లామర్ షో సూపర్!!

Tue, 08 Mar 2022-4:10 pm,

రాధేశ్యామ్ ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ముంబైలో రిలీజ్ ట్రైలర్ ఈవెంట్‌ను నిర్వహించారు. ఈవెంట్‌లో ప్రభాస్‌తో పాటు పూజా హెగ్దే కూడా హాజరై ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. 

కరోనా కారణంగా వాయిదా పుడుతూ వస్తున్న రాధేశ్యామ్.. ఎట్టకేళ్లకు మార్చి 11న  ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఏర్పాటు చేసిన ప్రమోషన్స్‌లో బుట్టబొమ్మ పాల్గొంటున్నారు. 

రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన 'రాధేశ్యామ్' మూవీలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సరసన పూజా హెగ్దే నటించారు.    

'ముగముడి' అనే తమిళ సినిమా ద్వారా సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన బుట్టబొమ్మ పూజా హెగ్డే.. నాగ చైతన్య హీరోగా వచ్చిన 'ఒక లైలా కోసం' సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చారు. అనతి కాలంలోనే స్టార్ హీరోలతో జతకట్టి టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link