Mullangi Sambar: వావ్.. యమ్మీ..యమ్మీ ముల్లంగి సాంబార్.. ఇలా చేస్తే సువాసనకు నోట్లో నీరు ఊరాల్సిందే..
చలికాలంలో మార్కెట్ లో ముల్లంగి ఎక్కువగా వస్తుంటాయి. ఇది తినడం వల్ల మనశరీరంకు బోలేడు ఆరోగ్య ప్రయోజనాలు కల్గుతాయి. ప్రతిరోజు తప్పకుండా అన్నం తినేటప్పుడు ముల్లంగి తినాలంటారు.
ముల్లంగి సాంబార్, కర్రీలుగా ఎక్కువగా చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తారు. మరీ ముల్లంగి సాంబార్ ఎలా చేస్తారో ఇప్పుడు చూద్దాం. ముల్లంగిని మొదట గా మార్కెట్ నుంచి తెచ్చుకున్నాక.. నీట్ గా కడగి పక్కన పెట్టుకొవాలి. అప్పటి వరకు కుక్కర్ లో.. కందిపప్పు వేసుకుని.. రెండు విజిల్స్ వచ్చేవరకుచూసి ఆతర్వాత పప్పు ఉన్న గ్యాస్ ను కట్టేయాలి.
ఆ తర్వాత గ్యాస్ మీద కడయ్ పెట్టుకుని రెండు చిన్నస్పూన్ లతో నూనె పొయాలి.నూనె వేడి అయ్యే వరకు.. ముల్లంగిని ముక్కలుగా లేదా రౌండ్ గా కట్ చేసుకుని పెట్టుకొవాలి. నూనె వేడి అయ్యా.. కడయ్ లో ఉన్న నూనెలో.. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, మిరప కాయ ముక్కలు, ఇంగువా వేయాలి.
దానిలోనే ముల్లంగి ముక్కల్ని కూడా వేయాలి. కాసేపు ముల్లంగి ముక్కల్ని నీట్ గా పైకి కిందకు మిక్స్ చేయాలి. మూత పెట్టి.. ఒక అయిదు నిముషాలు పెట్టాలి..ఆ తర్వాత దానిలో వెల్లుల్లి పెస్ట్, ధనియా పొడివేయాలి. ఒక పదినిముషాల పాటు అలానే గ్యాస్ మీద సిమ్ లో ఉంచాలి.
ఆ తర్వాత..ఈ ముక్కలను.. చప్పడి పప్పు ఉన్న కుక్కర్ లో మెల్లగా వేయాలి. మళ్లీ నీట్ గా కలపాలి. ఇలా పదిహేను నిముషాల పాటు గ్యాస్ మీద ఉంచి, ఉప్పు, కారం, పసుపు వేయాలి. కాసేపు చక్కగా.. ఉడికిన తర్వాత గ్యాస్ కట్టేయాలి. ఇలా చేస్తే మీ ఇంట్లోని సాంబార్ వాసన.. మీ వీధుల వరకు కూడా వస్తుంది.