Rahu Transit 2024 Good Effect: ఈ రాశులవారికి.. 2025 జనవరి వరకు డబ్బుల వర్షమే..
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహు గ్రహం ఒక రాశి నుంచి మరో రాశికి సంచారం చేయడమే కాకుండా.. అప్పుడప్పుడు ఈ గ్రహం నక్షత్ర సంచారం కూడా చేస్తుంది. ఈ గ్రహం నక్షత్ర సంచారం చేయడం కారణంగా కూడా రాశుల వారిపై ప్రత్యేకమైన ప్రభావం పడుతుంది.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం వ్యక్తుల జాతకంలో రాహు గ్రహం శుభస్థానంలో ఉంటే డబ్బుకు జీవితంలో అదృష్టానికి ఎలాంటి డోకా ఉండదు. అంతేకాకుండా గతంలో నష్టపోయిన డబ్బును కూడా రెట్టింపు లాభాలతో పొందే అదృష్టాన్ని పొందగలుగుతారు. అదే ఈ గ్రహం ఆ శుభ స్థానంలో ఉంటే జీవితం మొత్తం సమస్యలే.
ఇదిలా ఉంటే ఇప్పుడు రాహు గ్రహం నక్షత్ర సంచారం ప్రకారం ఉత్తర భాద్రపాద నక్షత్రంలో సంచార దశలో ఉంది అయితే డిసెంబర్ వరకు ఇలాగే ఉంటుందని జ్యోతిష్య శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. ఈ గ్రహం ఆగస్టు 16న ఉత్తరా భాద్రపాద నక్షత్రంలోకి సంచారం చేయగా డిసెంబర్ నెలలో తిరిగి ఇతర నక్షత్రంలోకి సంచారం చేస్తుంది.
ముఖ్యంగా ఈ రాహు ఎఫెక్ట్ కారణంగా డిసెంబర్ వరకు మకర రాశి వారు అద్భుతమైన లాభాలు పొందుతారు అలాగే వీరికి వ్యాపారాల పరంగా వస్తున్న ఎలాంటి సమస్యలైనా తొలగిపోతాయి అనుకున్న పనుల్లో జాక్పాట్ మనీ కూడా కొడతారు.
కుంభరాశి వారు కూడా డిసెంబర్ చివరి వరకు ఎంతో ప్రయోజనకరంగా ఉండబోతోంది ముఖ్యంగా వీరికి రాహు అనుగ్రహం లభించి అద్భుతమైన లాభాలు పొందగలుగుతారు. అలాగే బాహ్య జీవితంలో వస్తున్న సమస్యలు కూడా సులభంగా పరిష్కారం లభిస్తుంది.
తులారాశి వారికి కూడా రాహు అనుగ్రహం డిసెంబర్ వరకు ఉంటుందని జ్యోతిష్యులు చెబుతున్నారు. దీని కారణంగా వీరికి జీవితంలో ఎప్పుడూ పొందలేని ఆనందం లభిస్తుంది. అలాగే రుణాలు తీసుకున్న వారికి ఈ సమయం ఎంతో అనుకూలంగా ఉంటుంది దీని కారణంగా తిరిగి అప్పులు చెల్లించ గలుగుతారు. అలాగే ఆర్థిక సమస్యలు కూడా తొలగిపోతాయి.