Rahul Gandhi Birth Day: రాహుల్ గాంధీ చిన్ననాటి పిక్స్ చూశారా..? నాన్నమ్మ ఇందిరా గాంధీతో ఆటలు
రాహుల్ గాంధీ 19 జూన్ 1970లో ఢిల్లీలో జన్మించారు. రాజీవ్ గాంధీ, సోనియా గాంధీలకు మొదటి సంతానం.
రాహుల్ గాంధీ అంటే నాన్నమ్మ ఇందిరాగాంధీకి ఎంతో ఇష్టం. అమ్మమ్మతో కలిసి సభలకు వెళ్లేవారు.
రాహుల్ గాంధీ ఢిల్లీలోని మోడరన్ స్కూల్‌లో ప్రాథమిక విద్యను అభ్యసించిన తర్వాత డూన్ స్కూల్‌కు వెళ్లారు రాహుల్ గాంధీ.
1989లో రాహుల్ గాంధీ ఢిల్లీలోని సెయింట్ స్టీఫెన్స్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు. అయితే భద్రతా కారణాలతో ఉన్నత చదువుల నిమిత్తం యూఎస్ వెళ్లారు. ఆ తరువాత 1991లో హార్వర్డ్ యూనివర్సిటీని వదిలి ఫ్లోరిడాలోని రోలిన్స్ కాలేజీలో అడ్మిషన్ తీసుకున్నారు.
1994 సంవత్సరంలో ఆర్ట్స్ నుంచి పట్టభద్రుడయ్యారు. 1995లో కేంబ్రిడ్జ్ విశ్వవిద్యాలయంలోని ట్రినిటీ కళాశాల నుంచి ఎంఫిల్ పట్టా తీసుకున్నారు.
ప్రస్తుతం దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీకి క్రేజ్ పెరుగుతోంది. రాహల్‌ను ప్రధానిగా చూడాలని చాలా మంది కోరుకుంటున్నారు.