RRB Group D: నిరుద్యోగులకు రైల్వే బోర్డు శుభవార్త...రైల్వే లెవల్ 1 పోస్టులకు పది పాసైనా అర్హులే
Indian Railways Eases Level-1 Eligibility Criteria: నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది రైల్వే బోర్డు. లెవెల్ 1 పోస్టులకు కనీస అర్హత నిబంధనలను సడలించింది. కొత్త రూల్స్ ప్రకారం పదవ తరగతి పాసైన వారు కూడా లెవెల్ 1 గ్రూప్ డీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులని తెలిపింది. అంతేకాదు ఐటీఐ డిప్లొమా లేదా దానికి సమానమైన సర్టిఫికెట్, నేషనల్ కౌన్సిల్ ఫర్ వొకేషనల్ ట్రైనింగ్ ఎన్సీవీటీ మంజూరు చేసిన నేషనల్ అప్రెంటిస్ షిప్ సర్టిఫికేట్ ఎన్ఏసీ కలిగి ఉన్నవారూ కూడా ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
అంతకుముందు టెక్నికల్ డిపార్ట్ మెంట్లో పనిచేయాలంటే కచ్చితంగా పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించిన ఎన్ఏసీ లేదా ఐటీఐ డిప్లొమా కలిగి ఉండాలన్న నిబంధనలను ఉండేవి. ఈ మేరకు పాత రూల్స్ రద్దు చేస్తూ రైల్వే బోర్డు తాజాగా ఈ నిర్ణయం తీసుకుంది. దీనిపై అన్ని రైల్వే జోన్లకు రాతపూర్వకంగా సమాచారం కూడా అందించింది.
లెవెల్ 1 లో పలు డిపార్ట్ మెంట్లో అసిస్టెంట్స్, పాయింట్స్ మెన్, ట్రాక్ మెయింటెనర్స్ వంటి పోస్టులు ఉంటాయి. కాగా 32000లెవలె 1 పోస్టులు భర్తీ చేసేందుకు రైల్వే బోర్డు ఇటీవల నోటిఫికేషన్ కూడా జారీ చేసింది. దరఖాస్తు ప్రక్రియ జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22 వరకు జరుగుతుంది. దీనికి కూడా తాజాగా సడలించిన రూల్స్ వర్తిస్తాయి.
ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో ఈ పోస్టుల భర్తీకి వయస్సు 2025 జనవరి 7 నాటికి 18ఏళ్ల నుంచి 36ఏళ్ల మధ్య ఉండాలి. నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ అభ్యర్థులకు వయోపరిమితి సడలింపు కల్పించారు.
కంప్యూటర్ ఆధారిత ఎగ్జామ్ తో పాటు ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ , మెడికల్ ఎగ్జామినేషన్ ఆధారంగా ఉద్యోగాలకు సెలక్ట్ చేస్తారు. కాగా ఈ పోస్టులకు ప్రారంభ వేతనం రూ. 18వేల వరకు ఉంటుంది.