Rain Alert: దూసుకొస్తున్న అల్పపీడనం.. రేపటి నుంచి ఈ జిల్లాల్లో భారీ వర్షాలు.. ఐఎండీ అలెర్ట్

Rain Alert AP: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్ప పీడనం వల్ల ఏపీలోని ఈ జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. ఈ ప్రభావం రెండు మూడు రోజులు ఉంటుంది.

తమిళనాడు, శ్రీలంక వైపుగా కదులుతున్న అల్పపీడనం వల్ల ఏపీలోని రాయలసీమ, కోస్తా జిల్లాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని ఐఎండీ హెచ్చరించింది. మరికొన్ని ప్రాంతాల్లో మోస్తారు వర్షాలు కురుస్తాయి.

మత్స్యకారులు వేటకు వెళ్లకూడదని ఇప్పటికే హెచ్చరించారు. రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉంది కాబట్టి 13వ తేదీ వరకు ఈ జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయి.
ఈ నేపథ్యంలో వరికోతకు వెళ్లే రైతులు కూడా అత్యంత జాగ్రత్త వహించాలని ఐఎండీ హెచ్చరించింది. ఈ రోజు వర్షాలు పడే అవకాశం లేదు. అయితే, కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి జల్లులు కురిసే అవకాశం ఉంది.
ముఖ్యంగా ఏపీలోని రాయలసీమ జిల్లాల్లోని ప్రాంతాల్లో ఈ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. కాబట్టి ఈ ప్రాంత వాసులు జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ అల్పపీడన ప్రభావం మూడు రోజులపాటు ఉండనుంది.