Indian Top Directors: రాజమౌళి సహా బాక్సాఫీస్ దగ్గర రూ. 1000 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన భారతీయ దర్శకులు వీళ్లే..

Fri, 02 Aug 2024-11:37 am,

రాజమౌళి  బాహుబలి 2 మూవీతో తొలిసారి వెయ్యి కోట్ల గ్రాస్ క్లబ్బులో ప్రవేశించాడు రాజమౌళి. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1810 కోట్లకు పైగా వసూళ్లను సాధించింది.

బాహుబలి 2 తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్ లతో తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ మూవీ కూడా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1310 కోట్ల పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

నితీష్ తివారీ.. దంగల్ మూవీతో  దర్శకుడు నితీష్ తివారీ భారతీయ బాక్సాఫీస్ తో పాటు చైనా బాక్సాఫీస్ దగ్గర కలిపి రూ. 2010 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

ప్రశాంత్ నీల్ యశ్ హీరోగా నటించిన ‘కేజీఎఫ్ 2’ మూవీతో దర్శకుడు ప్రశాంత్ నీల్ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస దగ్గర రూ. 1215 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను సాధించింది.

 

అట్లీ షారుఖ్ ఖాన్ హీరోగా అట్లీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘జవాన్’ మూవీతో తొలిసారి వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర రూ. 1160 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి. 

సిద్ధార్థ్ ఆనంద్ షారుఖ్ హీరోగా తెరకెక్కిన ‘పఠాన్’ మూవీతో ఫస్ట్ టైమ్ రూ. వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు సిద్ధార్ధ్ ఆనంద్. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా రూ. 1055 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది.

నాగ్ అశ్విన్ నాగ్ అశ్విన్ .. ప్రభాస్ హీరోగా నటించిన ‘కల్కి 2898 AD’ మూవీతో ఫస్ట్ టైమ్ వెయ్యి కోట్ల క్లబ్బులో ప్రవేశించాడు. ఈ సినిమా గ్లోబల్ బాక్సాఫీస్ దగ్గర ఇప్పటి  వరకు రూ. 1111 కోట్ల వరకు రాబట్టినట్టు బాక్సాఫీస్ వర్గాలు చెబుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link