Meena Pics : నటిగా మీనాకు నలభై ఏళ్లు.. రజినీ, బోనీ కపూర్, రోజాల సందడి.. పిక్స్ వైరల్

మీనా బాలనటిగా తెరకు పరిచయం అయిన సంగతి తెలిసిందే. కోలీవుడ్‌లోనే ఆమె ఎంట్రీ జరిగింది. నేనింజగల్ అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది.

శివాజీ గణేషన్, రజినీకాంత్‌ల సినిమాల్లో బాలనటిగా మీనా నటించింది. అదే రజినీతో మీనా మళ్లీ హీరోయిన్‌గానూ నటించింది.

90వ దశకంలో రోజా, మీనా వంటి వారి శకం నడిచింది. మీనా అయితే చిరు, బాలయ్య, నాగ్, వెంకీ ఇలా అందరితోనూ నటించేసింది.
మీనా నటిగా నలభై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా చెన్నైలో గ్రాండ్ ఈవెంట్‌ను ప్లాన్ చేసింది. ఈ ఈవెంట్‌లో కోలీవుడ్ సందడి చేసింది.
రోజా, రజనీకాంత్, రాధిక, శరత్ కుమార్, దేవయాని ఇలా చాలా మంది మీనా కోసం కదిలి వచ్చారు.