Raksha bandhan 2024: రక్షా బంధన్ రోజున.. మీ సోదరికి ఈ బహుమతులు పొరపాటున కూడా ఇవ్వకూడదు..

Sun, 18 Aug 2024-2:35 pm,

రాఖీ పౌర్ణమిని అనేది అక్కాతమ్ముళ్లు, అన్నా చెల్లెమ్మల మధ్య ప్రేమను చాటే గొప్ప పండుగ.ఈ పండుగను కొన్నిరామాయణ, మహాభారత ఇతీహాసాల చరిత్ర కూడా ఉంది. మనం జరుపుకునే ప్రతి పండుగ వెనుకాల కూడా గొప్ప అర్ధందాగి ఉంటుంది. 

మహాభారతంలో శ్రీకృష్ణుడికి, ద్రౌపదీ రాఖీ కడుతుంది.అదే విధంగా ఒకసారిగా శ్రీకృష్ణుడికి చేయి కోసుకుని రక్తం కారుతు ఉంటుంది.అప్పుడు వెంటనే ద్రౌపదీ విలవిల్లాడిపోయి.. తన కొంగును చింపేసి.. శ్రీకృష్ణుడికివేలికి కట్టుకడుతుంది. ఆతర్వాత శ్రీకృష్ణుడు.. ద్రౌపదీకి అవమానం జరిగేటప్పుడు శ్రీకృష్ణుడు కాపాడతాడు. ఈ ఘటన.. కష్టసుఖాల్లో ఒకరికి మరోకరు అండగా నిలవాలనేది తెలియజేస్తుంది. 

ఇదిలా ఉండగా.. శ్రావణ  మాసంలో ప్రతిరోజు ఏదో ఒక పండగ ఉంటుంది. ముఖ్యంగా శ్రావణ మాసంలో సోమవారం, శుక్రవారం, శనివారంలను ఎంతో పవిత్రంగా భావిస్తారు.అదే విధంగా వరలక్ష్మీ వ్రతాలు, రాఖీ పండును, జన్మాష్టమి వంటికి పండుగలు చేసుకుంటారు. రాఖీ పండుగ రోజున తమకు ప్రేమతో రాఖీ కట్టిన అక్కా,చెల్లెమ్మలకు.. వారి సోదరులు ఏదో ఒక కానుక ఇస్తుంటారు. కానీ కానుకలు ఇచ్చేటప్పుడు మాత్రం కొన్ని జాగ్రత్తలు తీసుకొవాలి.  

రాఖీ పండుగ రోజు తమ అక్కా చెల్లెమ్మలకు చెప్పులు పొరపాటున కూడా ఇవ్వకూడదు. ఇవి చెడు ప్రభావం ను చూపిస్తుందని చెబుతుంటారు. అంతేకాకుండా నల్లని బట్టలు, లెదర్ హ్యాండ్ బ్యాగ్ లు సైతం  ఇవ్వొద్దని పండితులు చెబుతుంటారు.  

అంతేకాకుండా.. రాఖీ రోజున.. తమ అద్దం వంటివి గిఫ్ట్ లుగా అస్సలుఇవ్వకూడదు. అద్దంతోతయారు చేసిన వస్తువులును కాటుకలుగా ఇవ్వకూడదు.ఇవి నెగెటివ్ ఎనర్జీని తెచ్చిపెడతాయంట. కొన్నిసార్లు పగిలే అవకాశం కూడా ఉంటుంది.

ఈ మధ్య కాలంలో  చాలా మంది స్మార్ట్ వాచ్ లను కూడా ఇస్తున్నారు. కానీ వీటి వల్ల  ఒకరకమైన చెడు ప్రభావం కూడా ఉంటుందంట. అంతేకాకుండా..వాచీలను ఎప్పుడు కూడా ఉపయోగిస్తుండాలి. ఆగిపోయిన వాచీలను కూడా ఇంట్లో అస్సలు పెట్టుకొవద్దంట.

 కొంత మంది కడ్చీప్, రూమాలు కూడా ఇస్తుంటారు.ఇలా అస్సలు చేయకూడదు. తమ వారికి క్రూర జంతువుల టెడ్డీ బేర్ లు కూడా ఇవ్వకూడదని పండితులు చెబుతున్నారు.  వస్తువులు ఇచ్చేటప్పుడు చిరిగిపోయినవి, డ్యామెజ్ అయినవి అస్సలు ఇవ్వకూడదు.  

అదే విధంగా రాఖీ కట్టేటప్పుడు  భద్ర కాలంలో మాత్రం అస్సలు కట్టకూడదు.ఈ సారి ఆగస్టు 19 న ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 2 వరకు కూడా భద్రకాలం  ఉన్నట్లు తెలుస్తొంది. ఆ తర్వాత మాత్రమే తమ సోదరులకు, అక్కాచెల్లెమ్మలు రాఖీలుకట్టుకోవచ్చు. (Disclimer: పైన పేర్కొన్న అంశాలు కేవలం సోషల్ మీడియా వైరల్ కంటెంట్ ఆధారంగా ప్రస్తావించారు. వాటినే మేము అందిస్తున్నాము. దీన్ని Zee Mediaధృవీకరించలేదు.)

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link