Raksha Bandhan Special: విరాట్‌ కోహ్లీకి ఓ అక్క ఉందని తెలుసా? ఆమె ఎవరు?

Sun, 11 Aug 2024-10:50 pm,

Virat Kohli Sister: విరాట్ కోహ్లీకి ఒక అక్క ఉన్నారు. రాఖీ పండుగ సందర్భంగా వారిద్దరి మధ్య ఉన్న అనుబంధం తెలుసుకుందాం.

Virat Kohli Sister: విరాట్ కోహ్లీ అక్క పేరు భావనా ధింగ్రా. వారి కుటుంబంలో భావనా అందరి కంటే పెద్ద.

Virat Kohli Sister: ​​కోహ్లీకి అక్కతోపాటు ఒక తమ్ముడు కూడా ఉన్నాడు. అతడి పేరు వికాస్‌ కోహ్లీ. వీరు ముగ్గురు చిన్నప్పటి చాలా సంతోషంగా ఉండేవారు. ఎంతో ప్రేమతో స్నేహితుల్లా మాదిరి ఉంటారు.

Virat Kohli Sister: ఇక చిన్నప్పటి నుంచి తమ్ముళ్ల బాధ్యతలు భావన చూసుకునేది. ముఖ్యంగా కోహ్లీని క్రికెట్‌లో అక్క భావన ప్రోత్సహించారు. అతడు క్రికెటర్‌గా ఎదిగేందుకు సహకరించారు.

Virat Kohli Sister: భావన ​​వ్యాపారి సంజయ్ ధింద్రాను వివాహం చేసుకున్నారు. ప్రస్తుతం వారు వ్యాపారంలో బిజీగా ఉన్నారు. ఆ దంపతులకు మెహక్, ఆయుష్ అనే ఇద్దరు పిల్లలు ఉన్నారు.

 

Virat Kohli Sister: ఇక చిన్నప్పటి నుంచి తమ్ముళ్ల బాధ్యతలు భావన చూసుకునేది. ముఖ్యంగా కోహ్లీని క్రికెట్‌లో అక్క భావన ప్రోత్సహించారు. అతడు క్రికెటర్‌గా ఎదిగేందుకు సహకరించారు.

Virat Kohli Sister: తన తమ్ముడు విరాట్ కోహ్లీకి చెందిన బ్రాండ్ 'వన్‌8 సెలక్ట్‌'లో భావనా వ్యాపార భాగస్వామిగా ఉన్నారు.

Virat Kohli Sister: ఇక తన మరదలు అంటే ​​కోహ్లి భార్య అనుష్క శర్మతో కూడా భావన చాలా ఆత్మీయంగా ఉంటారు. అనుష్కతో కలిసి భావనా తరచూ ఇన్‌స్టాగ్రామ్‌లో బిజీగా ఉంటారు.

Virat Kohli Sister: ఈ ఫొటో తన తమ్ముడు విరాట్ కోహ్లీతో కలిసి చిన్నప్పటి భావన. ఒక వేడుకలో ఈ ఫొటో తీశారు.

Virat Kohli Sister: వివాహాలు చేసుకుని ఎవరి కాపురాలు వారికి ఉన్నా కూడా తరచూ తన తమ్ముళ్లు విరాట్‌, వికాస్‌లతో భావన ఆత్మీయంగా ఉంటారు. వ్యాపారంలోనూ భావనా కలిసి పని చేస్తున్నారు. మరి అలాంటి అక్క భావన ఈ రాఖీ పండుగకు తన తమ్ముళ్లు ఇద్దరికీ తప్పకుండా రాఖీ కట్టేందుకు వెళ్లకుండా ఎలా ఉంటారు.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link