Rakul Preet Singh: బ్లాక్ అవుట్ ఫిట్ లో ఆకట్టుకుంటున్న రకుల్.. అందాలకు ఫిదా..!
ప్రముఖ బ్యూటీ రకుల్ ప్రీత్ సింగ్ ఫిట్నెస్ ఫ్రీక్ గా పేరు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. ఒకవైపు సినిమాలలో నటిస్తూనే, మరోవైపు గ్లామర్ వలకబోస్తూ అందాల ఆరబోతతో యువతకు చెమటలు పట్టించే ప్రయత్నం చేస్తోంది.
తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్న రకుల్ ప్రీత్ సింగ్, ఆ తర్వాత చాలామంది స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది. తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న ఈమె ఎప్పుడు రూమర్స్ కి దూరంగానే ఉంటుందని చెప్పవచ్చు. తన పని తాను చేసుకుంటూ తన వ్యాపారాలతో బిజీగా ఉండే ఈమె హైదరాబాద్ వంటి నగరాలలో ప్రత్యేకంగా జిమ్ సెంటర్లను ఏర్పాటు చేసి భారీగా సంపాదిస్తోంది.
ఇదిలా ఉండగా ఇటీవలే తాను ప్రేమించిన ప్రముఖ బాలీవుడ్ నటుడు నిర్మాత అయిన జాకీ భగ్నానీ నీ ప్రేమించి మరీ వివాహం చేసుకుంది. ఇకపోతే వివాహం తర్వాత కలిసి రాదని , ఇబ్బందుల్లో పడుతుందని, ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామి కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అందుకు తగ్గట్టుగానే ఈమె భర్త జాకీ తన నిర్మాణ సంస్థలో పనిచేసే ఉద్యోగులకు జీతాలు ఇవ్వట్లేదని, వారందరూ సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. అలా దాదాపు రూ.250 కోట్లకు పైగా వీరు నష్టాలు చవిచూశారు.
అయితే మీరు అవేవీ పట్టించుకోకుండా ఎవరికివారు లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. అందులో భాగంగానే సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటున్న రకుల్ ప్రీతి సింగ్ ఎప్పటికప్పుడు గ్లామర్ ఫోటోలను షేర్ చేస్తూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందులో భాగంగానే తాజాగా మరొకసారి గ్లామర్ ఫోటోషూట్ షేర్ చేసింది ఈ ముద్దుగుమ్మ.
బ్లాక్ అవుట్ ఫిట్ లో తన అందాలతో మరొకసారి యువతను మెస్మరైజ్ చేసింది. స్ట్రాప్ లెస్ బ్యాక్ అందాలతో గిలిగింతలు పెట్టేసింది రకుల్ ప్రీత్ సింగ్. తాజాగా ఈమె షేర్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఏది ఏమైనా ఈమె ఫోటోలు చూసిన అభిమానులు రకరకాల కామెంట్లతో కామెంట్ బాక్స్ నింపేశారు.