Prachi Tehlan: రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి సినిమా ద్వారా పరిచయం…వైరల్ అవుతున్న బ్యూటీ ఫోటోలు!

Wed, 17 Jul 2024-7:12 pm,

అమన్ ప్రీత్‌ సింగ్‌ హీరోగా చేసిన త్రిశంకు సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరోయిన్..ప్రాచీ టెహ్లాన్‌. సినిమాలతోనే కాదు తన ఇంస్టాగ్రామ్ ఫోటోల ద్వారా కూడా తెగ అలరిస్తూ ఉంటుంది ఈ హీరోయిన్. ఎప్పటికప్పుడు ఈ భామ ట్రెండీ, హాట్ లుక్స్‌లో అలరిస్తూ.. నెటిజన్లకు కంటి మీద కునుకులేకుండా చేస్తోంది.

ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ లో.. తరచుగా ఫోటోలు షేర్ చేస్తూ అందరిని తెగ ఆకట్టుకుంటు ఉంటుంది. ఈ క్రమంలో తాజాగా.. ఈ నటి.. దివి నుంచి భూమికి దిగివచ్చిన శిల్పంలా.. వైట్ అండ్ వైట్ డ్రెస్ లో షేర్ చేసిన ఫోటోలు.. ఆమె అభిమానులను మరింత ఆకట్టుకుంటున్నాయి. 

వైట్ లెహంగాలు ఏంజెల్ లాగా మెరిసిపోతూ కెమెరాకు ఫోజులిచ్చింది. కాటుక కనులతో సోఫాపై హొయలుపోయింది. ఈ ఫోటోలు చూసినవారు ఎవరైనా సరే.. ఈ ఫోటోల నుంచి క్షణం కూడా కళ్ళు తిప్పుకోలేనంతగా.. తన అందంతో ఫిదా చేసింది ఈ హీరోయిన్.   

కాగా ప్రస్తుతం ఈ నటి..జీతూ జోసెఫ్ దర్శకత్వంలో మలయాళ స్టార్ హీరో మోహన్‌ లాల్‌ నటిస్తోన్న భారీ ప్రాజెక్టు రామ్‌ లో కీలక పాత్రలో కనిపించనుంది. యాక్షన్‌ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ చిత్రం చాలా కాలం క్రితమే లాంచ్ కాగా.. ప్రస్తుతం ఈ సినిమా గురించి మరిన్ని అప్డేట్స్ త్వరలో రానున్నాయి. 

అయితే ప్రస్తుతం ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు చూస్తున్న సినీ ప్రేక్షకులు.. ఈ హీరోయిన్ కి తప్పకుండా సినిమా ఇండస్ట్రీలో మంచి ఫ్యూచర్ ఉంది అంటూ కామెంట్లు పెడుతున్నారు. మరి తెలుగులో కూడా.. ఈ నటి.. భవిష్యత్తులో భారీ ప్రాజెక్టులు సొంతం చేసుకుంటుందో.. లేదో వేచి చూడాలి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link