Rakul Preet Singh: రెడ్ డ్రెస్సులో మెరిసిపోయిన రకుల్.. ఫిదా అవుతున్న అభిమానులు
రకుల్ ప్రీత్ సింగ్ కి ఈమధ్య వివాహం జరిగిన సంగతి తెలిసిందే. అయినా కానీ ఈ హీరోయిన్ కి ఇంకా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆమెకు తెలుగు, హిందీ ఇండస్ట్రీలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
సందీప్ కిషన్ హీరోగా వచ్చిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది రకుల్ ప్రీత్. ఈ సినిమాలో ‘ప్రార్థన…ప్రతి రూపాయి కౌంట్ ఇక్కడ’ అని రకుల్ చెప్పిన డైలాగ్ చాలా పాపులర్ అయింది.
ఆ తరువాత ఈ హీరోయిన్ వరస అవకాశాలు తెచ్చుకోవడం ప్రారంభించింది. తెలుగులో స్టార్ హీరోలు.. చిన్న హీరోలు అని తేడా లేకుండా దాదాపు అందరితోనూ నటించింది రకుల్ ప్రీత్.
తెలుగు సినిమాలలో దూసుకుపోతున్న సమయంలోనే హిందీలోకి అడుగు పెట్టింది. ఇక హిందీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాక.. తెలుగు సినిమాలను తగ్గిస్తూ వచ్చింది ఈ హీరోయిన్.
ఈ క్రమంలో రకుల్ మరలా తెలుగులో ఎప్పుడు కనిపిస్తుంది అని ఎదురుచూస్తున్నారు.. ఆమె అభిమానులు. మరోపక్క ఈ హీరోయిన్ ఇంస్టాగ్రామ్ ఫోటోలు.. వైరల్ అవుతూ అందరిని ఆకట్టుకుంటున్నాయి.