Rakul Preet Photos: బ్లాక్ బాడీ కాన్ డ్రెస్సులో పాలరాతి శిల్పంలా మెరిసిపోతున్న రకుల్ ప్రీత్ సింగ్..తట్టుకోవడం కష్టమే సుమీ!

తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ అనే సినిమాతో హీరోయిన్గా పరిచయమైన రకుల్ ప్రీత్ సింగ్ ఆ తర్వాత అతి తక్కువ సమయంలోనే తెలుగులో స్టార్ హీరోయిన్ గా స్థిరపడిపోయింది.

స్టార్ హీరోల సరసన వరుస సినిమా అవకాశాలు దక్కించుకుంటూ ఈ భామ టాలీవుడ్ లోనే నెంబర్ వన్ హీరోయిన్ స్థానం కూడా దక్కించుకుంది. అయితే కొత్త భామల ఎంట్రీ తో పాటు ఎంచుకుంటున్న సబ్జెక్టులు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో ఆమెకి ఇప్పుడు తెలుగులో సినిమాలే కరువయ్యాయి.

చివరిగా ఆమె క్రిష్ దర్శకత్వంలో వచ్చిన కొండపొలం అనే సినిమాలో నటించింది. ఆ తర్వాత ఇప్పటివరకు ఆమెకు మరో తెలుగు సినిమా అవకాశం దక్కలేదు. అయితేనేమి బాలీవుడ్ లో జాకీ భాగ్నానీ అనే వ్యక్తితో ప్రేమలో పడిన ఈ భామ అతని ఇన్ఫ్లుయెన్స్ తో బాలీవుడ్ అవకాశాలు దక్కించుకునే ప్రయత్నం చేస్తోంది.
బాలీవుడ్ లోనే పాగా వేసి అక్కడే స్థిరపడాలని చూస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడివారిని ఆకట్టుకునే విధంగా హాట్ హాట్ ఫోటోలు దిగుతూ సోషల్ మీడియాలో షేర్ చేస్తోంది .తాజాగా ఆమె నల్లటి డ్రెస్సులో షేర్ చేసిన హాట్ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయ.
ఆమె ఫోటోలు మీద అభిమానులు కుర్ర కారు, రకరకాల కామెంట్లు చేస్తున్నారు మరి ఇంకెందుకు ఆలస్యం ఆ ఫోటోల మీద మీరు కూడా ఒకసారి లుక్కు వేసేయండి.