Rakul Preet Singh: వైట్ కలర్ డ్రెస్సులో రకుల్ ప్రీత్ అందాల విందు.. చూసి తట్టుకోగలమా?
తెలుగులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్ సినిమాతో హీరోయిన్ గా లాంచ్ అయింది రకుల్ ప్రీత్ సింగ్. నిజానికి కన్నడలో 7/g బృందావన్ కాలనీ రీమేక్ సినిమాతో ఆమె హీరోయిన్ అయింది. కానీ ఆమెకు పెద్దగా గుర్తింపు అయితే లభించలేదు.
తెలుగులో సందీప్ కిషన్ తో చేసిన వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఆమెకు మంచి బ్రేక్ తీసుకుని వచ్చింది. ఆ తర్వాత తెలుగులో టాప్ హీరోయిన్ గా ఎదిగిన ఆమె తెలుగులో దాదాపుగా అందరూ బడా హీరోలతో జతకట్టింది.
అయితే కొత్త హీరోయిన్ల ఎంట్రీతో ఆమెకు తెలుగులో అవకాశాలు తగ్గాయి. అయితే ఆమె ఏ మాత్రం నిరుత్సాహపడకుండా వెంటనే బాలీవుడ్ చెక్కేసి అక్కడ సినిమా అవకాశాలు దక్కించుకునే ప్రయత్నాలు చేసి చాలా వరకు సఫలమైంది.
అక్కడే ఒక నిర్మాతతో ప్రేమలో పడిన ఆమె త్వరలోనే అతని పెళ్లి చేసుకుంటున్నట్లు కూడా అధికారికంగా ప్రకటించింది.
తాజాగా ఐఫా 2023 కి సంబంధించిన ఒక ఫోటో షూట్ లో ఆమె పాల్గొనగా అందులో తెల్లటి డ్రెస్సులో ఆమె మెరిసింది. ఆ డ్రెస్ లో ఆమె అందాలన్నీ బహిర్గతమయ్యేలా అందరికీ ట్రీట్ ఇచ్చేసింది. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా చూసేయండి మరి.