Rakul Preet Singh: పెళ్లికి సిద్ధమైన రకుల్.. న్యూ ఇయర్ కి అందాల విందు

Mon, 01 Jan 2024-9:33 pm,

Rakul Pics: దిల్లీకి చెందిన హిందీ భామ రకుల్ ప్రీత్ సింగ్.. 2009లో కన్నడ సినిమాతో ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. కానీ రకుల్ కి బ్రేక్ ఇచ్చింది మాత్రం తెలుగు ఇండస్ట్రీ. కణదాచిత్రం విడుదలైన దాదాపు నాలుగేళ్ల తర్వాత 'వెంకటాద్రి ఎక్స్‌ప్రెస్' అనే తెలుగు మూవీతో ఈమె కెరీర్ పరంగా బ్రేక్ అందుకుంది. 

సందీప్ కిషన్ జోడిగా ప్రార్థన పాత్రలో కనిపించి అప్పట్లో అందరిని మెప్పించింది రకుల్. ఇక ఆ సినిమాతో వరుసగా ఆఫర్లు అందుకుంటూ స్టార్ హీరోయిన్ అయిపోయింది. అలానే తెలుగులో స్టార్ హీరోలందరితోనూ యాక్ట్ చేసింది.

కానీ సడన్ గా హిందీలో అవకాశాలు రావడంతో తెలుగుకి దూరమైంది.ప్రస్తుతం రకుల్‌కి తెలుగు సినిమాల్లో అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. హిందీలో ఒకటో రెండో మూవీస్ చేస్తోంది. అయితే బాలీవుడ్ లో కూడా రకుల్ కి అనుకున్నంత విజయాలు రాలేదనే చెప్పాలి.  

ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ హీరోయిన్ పెళ్లికి సిద్ధమైపోయింది అని వార్తలు వినిపిస్తున్నాయి. 2021లో తన ప్రియుడు జాకీ భగ్నానీ అందరికీ పరిచయం చేసింది రకుల్. గత రెండేళ్ల నుంచి వీరిద్దరూ రిలేషన్‌లో ఉన్నారు. అయితే 2024 ఫిబ్రవరిలో ఈ జంట ఒకతవ్వుతున్నారట. ఓ ఆంగ్ల పత్రిక కథనం ప్రకారం.. ఫిబ్రవరి 22న గోవా వేదికగా రకుల్ ప్రీత్ డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేసుకుందని సమాచారం.

ఈ నేపథ్యంలో రకుల్ ఇంస్టాగ్రామ్ లో చేస్తున్న హాట్ షో మాత్రం అందరిని ఆకట్టుకుంటుంది. పెళ్లి దగ్గర పడుతున్న కానీ రకుల్ గ్లామర్ డోస్ పెంచి షేర్ చేస్తున్న ఫోటోలు అందరినీ ఆశ్చర్యపరచడమే కాకుండా ఫిదా కూడా చేస్తున్నాయి. ముఖ్యంగా స్కై బ్లూ మినీ డ్రెస్ లో.. పూల మాల మెడలో వేసుకొని రకుల్ షేర్ చేసిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link