Sai Pallavi: ఆ సినిమాకి రెమ్యూనరేషన్ తిరస్కరించిన సాయి పల్లవి…ఫిదా అవుతున్న అభిమానులు..!
సాయి పల్లవి గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు అవసరం లేదు. మలయాళీ సినిమా ప్రేమమ్ ద్వారా.. సినీ ప్రేక్షకులకు పరిచయమైంది ఈ హీరోయిన్. అంతకుముందు కొన్ని సినిమాలలో హీరోయిన్ ఫ్రెండ్ గా నటించింది. అంతేకాదు ఈటీవీలో ప్రచారమైన.. డి డాన్స్ ప్రోగ్రాంలో ఒక కంటెస్టెంట్ గా కూడా పార్టిసిపేట్ చేసింది.
కాగా శేఖర్ కమ్ములా దర్శకత్వంలో వచ్చిన ఫిదా సినిమా ద్వారా.. తెలుగు ప్రేక్షకుల మదిలో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది. ఈ చిత్రంలో భానుమతి క్యారెక్టర్ తో.. అందరినీ నిజంగానే ఫిదా చేసింది. ఇక ఈ సినిమా తర్వాత ఈ హీరోయిన్ కి తెలుగులో వరసగా అవకాశాలు రావడం మొదలయ్యాయి.
సాయి పల్లవి మరోసారి శేఖర్ కమ్ములాతో చేసిన లవ్ స్టోరీ సినిమా కూడా ఆమెకు.. మంచి పేరు తెచ్చిపెట్టింది. మరోపక్క తమిళంలో కూడా ధనుష్, సూర్య లాంటి హీరోలతో నటించి.. ఎన్నో అవకాశాలు సంపాదించుకుంది. ప్రస్తుతం నితీష్ తివారి దర్శకత్వంలో బాలీవుడ్ లో రానున్న రామాయణం చిత్రంలో సీతగా కనిపించనుంది.
అయితే ఈ హీరోయిన్ సినిమాల వల్లే కాకుండా.. తన వ్యక్తిగత జీవితం వల్ల కూడా తరచూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ముఖ్యంగా ఫేర్ అండ్ లవ్లీ.. అడ్వటైజ్మెంట్ కోసం సాయి పల్లవికి రెండు కోట్లు ఆఫర్ చేసినప్పుడు.. తాను అలాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ ని ప్రమోట్ చేయను అంటూ అది రిజెక్ట్ చేసింది. అప్పుడు ఎంతోమంది ఈమె నిర్ణయాన్ని గౌరవించారు.
అప్పటినుంచి సాయి పల్లవి.. వ్యక్తిత్వానికి కూడా ఎంతోమంది అభిమానులు ఏర్పడ్డారు. ఇక ప్రస్తుతం ఈ హీరోయిన్ గురించి మరో వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూ.. ఆమెపై మరింత అభిమానాన్ని పెంచుతోంది. అసలు విషయానికి వస్తే సాయి పల్లవి తెలుగులో శర్వానంద్ కి జోడిగా.. పడి పడి లేచే మనసు అనే సినిమాలో కనిపించింది. అయితే ఆ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్దగా ఆడలేదు. ఇక సినిమా ఫ్లాప్ అవ్వడంతో.. ఆ తరువాత నిర్మాతలు ఫుల్ రెమ్యూనరేషన్ ఇచ్చినా కానీ సాయి పల్లవి తిరస్కరించిందట. సినిమా ఫ్లాప్ పైన కారణంగా కేవలం కొద్దిగా మాత్రమే రెమ్యూనరేషన్ తీసుకుందట ఈ హీరోయిన్.