Rana Wig: రానా పెట్టుకునేది విగ్…తన బట్టతల గురించి అసలు విషయం బయటపెట్టిన హీరో..!
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన లీడర్ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన హీరో రానా. ఆ తరువాత ఎన్నో చిత్రాలలో నటించిన రానాకి.. మంచి విజయం తెచ్చి పెట్టిన సినిమా బాహుబలి.
బాహుబలి సినిమాతో ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిపోయాడు ఈ నటుడు. తెలుగులోనే కాకుండా పలు హిందీ, తమిళ సినిమాలలో కూడా నటించారు. ముఖ్యంగా తాను హీరోగా మాత్రమే చేస్తాను అంటూ ఎప్పుడూ హద్దులు పెట్టుకోలేదు రానా.
ఎన్నో సినిమాలలో విలన్ గా కనిపించిన ఈయన.. తన తండ్రి సురేష్ బాబులానే కొన్ని సినిమాలకి నిర్మాతగా కూడా వ్యవహరించారు. ఇక పక్క హీరోల చిత్రాలు ప్రమోట్ చేయడంలో కూడా ఎప్పుడూ ముందుంటారు ఈ దగ్గుబాటి హీరో.తాజాగా దుల్కర్ సల్మాన్ లక్కీ భాస్కర్ సినిమాని ప్రమోట్ చేయడంలో తన వంతు పాత్ర పోషించారు. ఇందులో భాగంగా ఒక ప్రమోషనల్ ఇంటర్వ్యూలో దుల్కర్ సల్మాన్ ని కొన్ని ప్రశ్నలు అడిగారు రానా.
ఈ సందర్భంగా దుల్కర్‌తో మాట్లాడుతూ.. రానా దుల్కర్ ని.. నీ జుట్టు బాగుంది. నీ క్రాఫ్ వల్ల ఎలాంటి పాత్రలకైనా నువ్వు సరిపోతారు అంటూ కామెంట్ చేశాడు. దాంతో మీనాక్షి చౌదరీ మాట్లాడుతూ.. అవును కేరళ నుంచి వచ్చే హీరో, హీరోయిన్ల జుట్టు చాలా బాగుంటుంది అని చెప్పుకొచ్చింది.
ఈ కామెంట్స్ పై స్పందిస్తూ దుల్కర్.. రానా నీ జుట్టు కూడా బాగుంటుంది అని అన్నాడు. దాంతో “నాది రియల్ జుట్టు కాదు.. ఇది హెయిర్ బాండ్ ఫిక్సింగ్. విగ్గులాంటిది పెట్టుకొంటాను” అని చెప్పుకొచ్చారు. అయితే ఇలా రానా మీడియా ముందే తన జుట్టు నిజమైంది కాదు విగ్గు అని చెప్పడంతో.. దుల్కర్, మీనాక్షి తో పాటు ప్రేక్షకులకు కూడా ఆశ్చర్యపోతున్నారు. అయితే అందరూ కూడా ఆయన నిజాయితీని ప్రశంసిస్తున్నారు.