Rashmi Gautam: రష్మి గౌతమ్‌కు కాబోయేవాడు అతడేనా.. ? త్వరలో పెళ్లి పీఠలు ఎక్కబోతున్న జబర్ధస్ బ్యూటీ.. ?
తెలుగు రాష్ట్రాల్లో రష్మీ గౌతమ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకున్నారు. గత కొన్ని నెలలుగా యాంకర్ రష్మి పెళ్లి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
ఈ మోస్ట్ ఎలిజిబుల్ లేడీ బ్యాచిలర్ పెళ్లి బాజా ఎపుడు మోగుతుందని ఫ్యాన్స్ అంతా వెయిట్ చేస్తున్నారు. తాజాగా కాబోయే వాడిపై మనసులో మాట బయటపెట్టింది యాంకర్ రష్మి.
ఈమెకు కాబోయే వాడు ఒరిస్సాకు చెందిన ఓ యువ వ్యాపారవేత్త అనే టాక్ వినిపిస్తోంది. త్వరలో అతన్ని పెళ్లి చేసుకోబోతున్నట్టు సమాచారం.
ఇక రష్మి గౌతమ్, సుడిగాలి సుధీర్ మధ్య ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ గురించి అందరు చర్చించుకోవడం ఎప్పటి నుంచో చూస్తున్నాము. ఇక స్క్రీన్ పై వీరి జోడికి ఆడియన్స్ ఫిదా అయ్యారు.
రష్మి గౌతమ్ కేవలం యాంకర్‌గానే కాకుండా.. గుంటూరు టాకీస్ వంటి పలు సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ సినిమాలో రష్మి గౌతమ్ చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ అప్పట్లో పెద్ద హాట్ టాపిక్‌గా మారిందనే చెప్పాలి.
ఓ వైపు యాంకరింగ్, మరో సినిమాలతో రష్మి గౌతమ్ కెరీర్ మూడు ఆఫర్స్.. ఆరు సినిమాలన్నట్టుగా సాగిపోతుంది.
రష్మి గౌతమ్ కేవలం నటిగానే కాకుండా.. సామాజిక అంశాలపై స్పందిస్తూ ఉంటుంది. ముఖ్యంగా మూగ జీవాలపై జరిగే అమానవీయ సంఘటనలపై గళమెత్తుతూనే ఉంటుంది.
ఇలా సినిమాలు, జబర్థస్త్ వంటి షోల్లో అందాల ప్రదర్శన కాదు.. మిగిలిన సామాజిక అంశాల్లో తనదైన ముద్ర వేస్తూ ముందుకు సాగిపోతూనే ఉంది రష్మి గౌతమ్.