Rashmika Mandanna: బాలీవుడ్‌లో మరో బంపరాఫర్ కొట్టేసిన రష్మిక.. సల్మాన్ సరసన నేషనల్ క్రష్ అధికారిక ప్రకటన..
రష్మిక మందన్న మన దేశంలో అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది. గతేడాది యానిమల్ మూవీతో ఈమె క్రేజ్ అమాంతం పెరిగింది. తాజాగా సల్మాన్ ఖాన్, మురగదాస్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సికిందర్ మూవీలో కథానాయికగా నటిస్తోంది.ఈ విషయాన్ని రష్మిక స్వయంగా ప్రకటించింది.
ఇంట గెలిచి రచ్చ గెలవాలంటారు. రష్మిక ఇంట సౌత్ సినీ ఇండస్ట్రీలో విజయాలు అందుకుంటూనే బాలీవుడ్‌లో రచ్చ చేస్తోంది. ఈమె వివిధ భాషల్లో నటించిన అన్ని చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అందుకోవడం విశేషం. ఈ రేంజ్‌లో అన్ని భాషల్లో హీరోయిన్‌గా ఈ మధ్య కాలంలో రష్మిక మినహా ఎవరు లేరు.
లాస్ట్ ఇయర్ మొదట్లో 'మిషన్ మజ్ను', యేడాది చివర్లో 'యానిమిల్' మూవీస్‌తో ప్యాన్ భారత్ లెవల్లో సత్తా చాటింది. దీంతో రష్మిక పేరు మారు మోగిపోయింది. ఈ యేడాది ఆగష్టు 15న 'పుష్ప 2' మూవీతో ప్రేక్షకుల ముందుకు రానుంది.
రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ కూడా సత్తా చాటుతోంది. అన్ని ఇండస్ట్రీస్‌లో జెట్ స్పీడ్‌లో దూసుకుపోతుంది.
రష్మిక మందన్నకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 43 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం రష్మిక చేతిలో పలు క్రేజీ ప్యాన్ ఇండియా ప్రాజెక్ట్స్ ఉన్నాయి.