Rashmika Mandanna: రష్మిక - రక్షిత్ మధ్య బ్రేకప్ అవ్వలేదా.. అతడే విడగొట్టాడా..?
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న రష్మిక మందన్న తొలిసారి ఛలో సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యింది. మొదటి సినిమాతోనే నటనతో అందరిని అబ్బురపరిచిన ఈ ముద్దుగుమ్మ , ఆ తర్వాత గీతాగోవిందం సినిమాతో ఓవర్ నైట్ లోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది.
ఇక ఈ సినిమా అందించిన విజయం ఏకంగా మహేష్ బాబు సినిమాలో నటించే అవకాశాన్ని అందించిందని చెప్పవచ్చు.. అలా మహేష్ బాబు హీరోగా విజయశాంతి రీ యంట్రీ ఇచ్చిన చిత్రం సరిలేరు నీకెవ్వరు. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించి మంచి విజయాన్ని సొంతం చేసుకుంది రష్మిక.
ఇక సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా నటించిన పుష్ప సినిమాలో నటించి ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. ఇప్పుడు పుష్ప 2 సినిమా షూటింగ్లో బిజీగా ఉంది ఈ ముద్దుగుమ్మ. ఈ సినిమా డిసెంబర్ 6వ తేదీన విడుదల కాబోతోంది. ఇదిలా ఉండగా బాలీవుడ్ లో కూడా వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది రష్మిక. రష్మిక కెరియర్ పరంగా దూసుకుపోతోంది కానీ వ్యక్తిగతంగా ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తోందని చెప్పవచ్చు.
ఇదిలా వుండగా రష్మిక తొలిసారి కిర్రిక్ పార్టీ..అనే సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైంది. ఇందులో హీరోగా నటించిన రిషబ్ శెట్టితో ప్రేమలో పడింది ఈ ముద్దుగుమ్మ. అంతేకాదు అతనితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకుని ఏడు అడుగులు వేయాలనుకుంది. అయితే అనుకోకుండా వీరిద్దరూ తమ ఎంగేజ్మెంట్ ను క్యాన్సిల్ చేసుకున్నారు. దీంతో రకరకాల రూమర్సు వైరల్ అయ్యాయి. దీనిపై రష్మిక తల్లి సుమన్ మందన్న కూడా అప్పట్లో క్లారిటీ ఇచ్చారు.
సుమన్ మందన్న మాట్లాడుతూ.. ‘ఎంగేజ్మెంట్ తరువాత రష్మిక తెలుగులో నటించడం మొదలుపెట్టింది. ఇక రష్మిక క్రేజ్ చూసి రక్షిత్ శెట్టి ఆమె సినిమా వ్యవహారాలు చూసుకోవడానికి ఒక మేనేజర్ ను నియమించాడు. అయితే అతడి ప్రవర్తన రష్మికకు నచ్చలేదు. దీంతో మేనేజర్ గా అతడిని తీసేసింది. ఈ విషయం నచ్చక రక్షిత్ - రష్మిక ఇద్దరూ గొడవపడ్డారు..ఇక తర్వాత కుటుంబ సభ్యులుగా మేము కలగజేసుకొని సామరస్యంగానే వీరిద్దరి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసాము’ అంటూ ఆమె తెలిపిందని సమాచారం మొత్తానికి అయితే మేనేజర్ వల్లే రష్మిక - రక్షిత్ విడిపోయారని సమాచారం.