Vijay-Rashmika: ఇప్పుడు ఇంకేదో అనిపిస్తుంది.. విజయ్‌ని కలిసిన ఆనందంలో తబ్బిబ్బవుతున్న రష్మిక!
చాలా రోజుల తర్వాత విజయ్‌ని కలవడంతో రష్మిక ఆనందంతో తబ్బిబ్బయ్యారు. ఎప్పటినుంచో సార్‌తో సినిమా చేయాలని అనుకుంటున్నా.. ఇలా అవకాశం వచ్చింది. ఇప్పుడు ఇంకేదో అనిపిస్తుంది.. ఇక సార్‌తో డ్యాన్స్ చేస్తా అని రష్మిక ట్వీట్ చేశారు.
ఈ సినిమాలో విజయ్ సరసన నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఈ ఇద్దరి కాంబోలో వస్తున్న తొలి చిత్రం ఇదే.
తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కనున్న ఈ సినిమాను శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌లో దిల్ రాజు నిర్మిస్తుండగా.. తమన్ సంగీతం అందించనున్నాడు.
విజయ్ 66వ సినిమా బుధవారం ఉదయం పూజ కార్యక్రమాలను ఘనంగా జరుపుకుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజు హీరోహీరోయిన్ల తొలి సన్నివేశానికి క్లాప్ కొట్టారు.
తమిళ స్టార్ హీరో దళపతి విజయ్, డైరెక్టర్ వంశీ పైడిపల్లి కాంబినేషన్‌లో ద్విభాషా చిత్రం రాబోతోన్న సంగతి తెలిసిందే. విజయ్ నేరుగా చేస్తున్న తొలి తెలుగు సినిమా ఇదే కావడం విశేషం.