Rashmika Mandanna: ఆమె నా కూతురు.. తను సంతోషంగా ఉంటే చాలు: రష్మిక మందన్న

Sun, 11 Aug 2024-5:13 pm,

రష్మిక మందన్న గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయాలు.. అవసరం లేదు. ఛలో సినిమాతో.. తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ హీరోయిన్ గీతాగోవిందం సినిమాతో స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. గీతా గోవిందం తర్వాత నుంచి.. తెలుగులో వరస అవకాశాలు అందుకుంది.

ఈ మధ్య విడుదలైన అల్లు అర్జున్ పుష్ప సినిమాతో.. పాన్ ఇండియా లెవెల్లో ఫేమస్ అయ్యింది. ఆ తరువాత హిందీలో చేసిన యానిమల్ సినిమా కూడా ఈమెకు మంచి విజయం అందించడంతో.. ఇప్పుడు సౌత్ తో పాటు నార్త్ లో కూడా వరస అవకాశాలు అందుకుంటోంది. 

ప్రస్తుతం రష్మిక పుష్ప 2 చిత్రంలోనే కాకుండా.. ధనుష్ హీరోగా చేస్తున్న కుబేర సినిమాలో.. రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో వస్తున్న గర్ల్ ఫ్రెండ్ సినిమాలో కూడా కనిపించనంది. మరో పక్క త్వరలోనే యానిమల్ పార్క్ రెండో భాగంలో.. కూడా రష్మిక కనిపించనుంది. 

సినిమాల విషయం పక్కన పెడితే.. పర్సనల్ లైఫ్ విషయాల ద్వారా కూడా రష్మిక తరచు వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. రష్మిక ఫ్యామిలీ విషయానికి వస్తే.. రష్మికకు తన చెల్లెలు అంటే ప్రాణం. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటి అంటే..రష్మికకు ఆమె చెల్లికి దాదాపు పది సంవత్సరాల గ్యాప్ ఉంది. 

ప్రస్తుతం రష్మిక వయసు 28 సంవత్సరాలు కాగా.. ఆమె చెల్లెలు షిమాన్ మందన్న  వయసు 9 ఏళ్లు. తన చిన్నారి చెల్లెలు ఎదుగుదలను తాను మిస్ అవుతున్నానని.. అలాగే తనతో సరదాగా గడిపే సమయాన్ని మిస్ అవుతున్నానని.. ఎన్నో ఇంటర్వ్యూస్ లో చెప్పుకొచ్చింది ఈ హీరోయిన్. అంతేకాదు తనకు తన చెల్లెలు కూతురు లాంటిదని.. తాను సంతోషంగా ఉండడమే తను ఎప్పుడు కోరుకుంటానని చెప్పుకొచ్చింది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link