Rashmika Mandanna: ‘పుష్ప 2’ బ్లాక్ బస్టర్ తో ఫుల్ జోష్ లో రష్మిక.. వర్కౌట్ అయిన క్రష్మిక డిసెంబర్ సెంటిమెంట్..
Rashmika Mandanna: ప్రెజెంట్ మన దేశంలో అసలు సిసలు ప్యాన్ ఇండియా స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న అనే చెప్పాలి. తాజాగా పుష్ప 2 సక్సెస్ తో శ్రీవల్లి పండగ చేసుకుంటుంది. అంతేకాదు ఆమె అభిమానులు రష్మిక డిసెంబర్ సెంటిమెంట్ మరోసారి వర్కౌట్ అయిందని చెబుతున్నారు.
రష్మిక విషయానికొస్తే.. పుష్ప1 తో తొలి ప్యాన్ ఇండియా సక్సెస్ అందుకుంది. గతేడాది ‘యానిమల్’ చిత్రంతో రష్మిక క్రేజ్ అమాంతం పెరిగింది. మొత్తంగా రష్మిక హీరోయిన్ గా క్రేజ్ తీసుకొచ్చిన ఈ మూడు చిత్రాలు డిసెంబర్ లో విడుదల కావడం విశేషం.
అంతేకాదు రష్మిక యాక్ట్ చేసిన ఫస్ట్ కన్నడ చిత్రం ‘కిరిక్ పార్టీ’ మూవీ కూడా డిసెంబర్ నెలలో విడుదలైన సంచలన విజయం సాధించింది. అంతేకాదు రష్మిక కథానాయికగా మంచి బ్రేక్ ఇచ్చింది.
అలు కన్నడలో పునీత్ రాజ్ కుమార్ తో చేసిన ‘అంజనీపుత్ర’, ‘ ఛమక్’ మూవీలు కూడా డిసెంబర్ లో విడుదలై రష్మిక కు వరుస అందించాయి. ఆయా సినిమాలు రష్మిక కు ప్రేక్షకుల్లో క్రేజ్ తీసుకొచ్చాయనే చెప్పాలి.
పుష్ప ది రైజ్ పార్ట్ 1, యానిమల్, పుష్ప 2 ది రూల్ చిత్రాలు కూడా డిసెంబర్ నెలలో విడదలై పెద్ద విజయాలను నమోదు చేశాయి. ఈ మూడు సినిమాలతో రష్మికకు నేషనల్ వైడ్ క్రేజ్ ను తీసుకొచ్చాయనే చెప్పాలి.
తాజాగా ఈ నెల 5న విడుదల అయిన ‘పుష్ప 2 ది రూల్’ మూవీ బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అంతేకాదు కేవలం ఆరు రోజుల్లో రూ. 1000 కోట్ల క్లబ్బులో ప్రవేశించిన చిత్రంగా రికార్డు క్రియేట్ చేసింది. హీరోగా అల్లు అర్జున్, రష్మికకు తొలి రూ. వెయ్యి కోట్ల సినిమా అని చెప్పాలి. మొత్తంగా రష్మిక వరుస విజయాలతో గాల్లో తేలిపోతుంది.