Rashmika Mandanna Hair Style : చింపిరి జుట్టుతో రష్మిక మందాన్న.. వింత పోజులు, వింత స్టైల్

నేషనల్ క్రష్‌గా రష్మికకు సోషల్ మీడియాలో ఉన్న క్రేజ్ గురించి అందరికీ తెలిసిందే. రష్మిక మీద ఎంతగా ట్రోలింగ్ జరుగుతుందో.. అంతగా డిమాండ్ క్రేజ్ పెరుగుతూ ఉంటుంది.

రష్మికకు ఇప్పుడు తెలుగులో క్రేజీ ప్రాజెక్టులేమీ ఎక్కువగా రావడం లేదు. పుష్ప ది రూల్ తప్పా ఆమె చేతిలో భారీ సినిమాలేవీ లేవు.
హిందీలో రష్మిక చేసిన సినిమాలు బోల్తా కొట్టేశాయి. మిషన్ మజ్ను, గుడ్ బై సినిమాలు బోల్తా కొట్టేశాయి. ఇక యానిమల్ సినిమా మీదే తన ఆశలు పెట్టుకుంది.
వారిసు సినిమాతో తమిళంలో కాస్త సందడి చేసింది రష్మిక మందాన్న. ఇప్పుడు రెయిన్ బో అనే కొత్త సినిమాను స్టార్ట్ చేసింది రష్మిక.
ఇక తాజాగా రష్మిక మందాన్న సోషల్ మీడియాలో వింత హెయిర్ స్టైల్‌తో వింత పోజులు పెడుతూ కనిపించింది. ప్రస్తుతం ఈ ఫోటోల మీద ట్రోలింగ్ జరుగుతోంది.