Rashmika Mandanna: ఎర్ర పట్టుచీరలో రష్మిక.. లేడీ పుష్ప రాజ్ లాగా ఫోజులు..
Rashmika Mandanna Pics: నాగ శౌర్య హీరోగా చేసిన ఛలో సినిమా ద్వారా పరిచయమైన కనడ బ్యూటీ రష్మికా మందన్న. ఆ తరువాత విజయ్ దేవరకొండ గీతాగోవిందం సినిమాతో సూపర్ సక్సెస్ అందుకొని స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.
తెలుగులో వరస ఆఫర్లు తెచ్చుకున్న రష్మిక కి అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమా ఫ్యాన్ ఇండియా బ్లాక్ బస్టర్ ఇచ్చింది.
పుష్ప సినిమాలో శ్రీవల్లిలా కనిపించి అందరిని మెప్పించింది రష్మిక. కాగా ఈ సినిమా ఆమెకు సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా ఎన్నో ఆఫర్లు తెచ్చిపెట్టింది.
ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా వరుసగా సినిమాలు అందుకుంటున్న రష్మిక ఫోటోలు కొన్ని సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.
ఈ ఫోటోలలో ఎర్ర పట్టుచీర కొట్టుకొని.. థగథగా మెరిసే ఎన్నో నగలు వేసుకొని.. నడుము చుట్టూ బెల్ట్ వేసుకుని మరి రష్మిక కనిపించింది.
ఈ ఫోటోలు చూసిన వారందరూ ఈ ఫోటోలలో రష్మికానీ చూస్తే లేడీ పుష్ప రాజ్ ని చూసినట్టు ఉంది అని.. కాబట్టి ఈ ఫోటోలు పుష్ప 2 సినిమాలోవే ఏమో అని అందరూ అనుకున్నారు.
అయితే ఈ ఫోటోలు వైరల్ అయిన కాసేపటికి రష్మిక టీమ్ ఇవి తను చెయ్యబోతున్న అడ్వటైజ్మెంట్ లో ఫోటోలు అని క్లారిటీ ఇచ్చింది.