Rashmika Mandanna: విదేశీ వీధుల్లో మజా చేస్తోన్న రష్మిక మందన్న.. లేటెస్ట్ పిక్స్ వైరల్..

Fri, 23 Feb 2024-1:40 pm,

రష్మిక మందన్న శాండిల్ వుడ్ నుంచి టాలీవుడ్, కోలీవుడ్ ఇపుడు బాలీవుడ్ బాట పట్టింది. నటించిన అన్ని భాషల్లో బ్లాక్ బస్టర్స్ అందుకున్న హీరోయిన్‌గా సత్తా చూపెడుతోంది.

అంతేకాదు అసలు సిసలు ప్యాన్ ఇండియా హీరోయిన్‌గా ఆమె కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇక హిందీ సినిమాల్లో నటించే ముందే 'టాప్ టక్కర్' ఆల్బమ్‌లో నటించి అక్కడ ప్రేక్షకులను సైతం మెప్పించింది.

2020లోనే నేషనల్ క్రష్‌గా ఎంపికైన రష్మిక..  హిందీలో గుడ్ బై, మిషన్ మజ్ను, యానిమిల్ సినిమాల్లో నటించింది. యానిమల్ మూవీ హిందీలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది.

రష్మిక మందన్నకు ప్రముఖ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపు 40 మిలియన్‌కు పైగా ఫాలోవర్స్ ఉన్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో పలు క్రేజీ ప్రాజెక్ట్స్ ఉన్నాయి.

ఇక యానిమల్ సినిమాలో రణ్‌బీర్ కపూర్‌తో రష్మిక చేసిన ఆన్ స్క్రీన్ రొమాన్స్ ప్రేక్షకులకు హీట్ పుట్టించింది. త్వరలో ఈ భామ అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న 'పుష్ప2'తో పలకరించనుంది. ఈ సినిమా ఆగష్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ కానుకగా విడుదల కానుంది.

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link