Rashmika Mandanna: రష్మిక మందన్న అందాల విందు…సోయగాలతో ఫిదా చేస్తున్న నేషనల్ క్రష్
ఛలో సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన రష్మిక మందన్న ఆ తరువాత విజయ్ దేవరకొండ తో చేసిన గీతాగోవిందం సినిమా ద్వారా టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా మారింది. ఈ కన్నడ బ్యూటీ కి సౌత్ ఇండియాలో ఎంతోమంది అభిమానులు ఉన్నారు.
అల్లు అర్జున్ తో చేసిన పుష్ప సినిమా వల్ల సౌత్ ఇండియాలోనే కాకుండా నార్త్ ఇండియాలో కూడా తెగ క్రేజ్ తెచ్చుకుంది ఈ బ్యూటీ. ఏకంగా అమితాబ్ బచ్చన్ తో కూడా నటించే అవకాశం సంపాదించుకుంది.
ఇక ఈమధ్య అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డివంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా చేసిన బ్లాక్ బస్టర్ మూవీ యానిమల్ లో గీతాంజలి క్యారెక్టర్ లో నటించి అందరి ప్రశంసలు అందుకుంది.
ఆన్ స్క్రీన్ పైనే కాదు ఆఫ్ స్క్రీన్ లో కూడా రష్మికకు అభిమానులు ఫిదా అవుతున్నారు. ఆమె తరచుగా ఇంస్టాగ్రామ్ లో తాను చీరలో ఉన్న ఫోటోలు షేర్ చేస్తూ.. అందానికే అసూయ తెప్పించేలా తన అభిమానులను మెప్పిస్తూ ఉంటుంది..
ముఖ్యంగా ఈ మధ్య రష్మిక నిమ్మ పండు రంగు చీరలో.. నలుపు చీరలో.. పోయిన సోయగాలు యువతను నిద్ర పట్టకుండా చేస్తున్నాయి. ఆ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ అందరిని అలరిస్తున్నాయి.
రష్మిక మందన్న ప్రస్తుతం గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా తనకు బ్లాక్ బస్టర్ ఇచ్చిన పుష్ప సీక్వెల్ పుష్ప ది రూల్ లో శ్రీవల్లి క్యారెక్టర్ లో మరోసారి కనిపించనుంది ఈ ముద్దుగుమ్మ.