Rashmika mandanna: నరకం అనుభవించా.. ఆ బాధ నుంచి ఇప్పటికి బయటపడలేకపోతున్నా..!
కన్నడ ముద్దుగుమ్మ రష్మిక మందన్న కన్నడలో కిరిక్ పార్టీ అనే సినిమాలో నటించి మంచి పేరు సొంతం చేసుకుంది. అయితే ఆ తర్వాత తెలుగులో ఛలో సినిమాతో అడుగుపెట్టి ,మొదటి సినిమాతోనే విమర్శకుల ప్రశంసలు అందుకుంది. ఇక రెండవ సినిమా విజయ్ దేవరకొండ తో గీతాగోవిందం సినిమాలో నటించి, హోమ్లీ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఈ సినిమా సక్సెస్ అవడం ఒక ఎత్తు అయితే విజయ్ దేవరకొండ తో ఈమె రిలేషన్ లో ఉందనే వార్తలు కూడా వినిపించాయి. ఆ తర్వాత డియర్ కామ్రేడ్ లో కూడా వీళ్ళిద్దరూ కలిసి నటించారు. అయితే వీరిద్దరి కెమిస్ట్రీ ఆన్ స్క్రీన్ లో చాలా.. అద్భుతంగా పండింది. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నా సరే ఈ జంటకు ప్రత్యేక అభిమానులు ఉన్నారు. అందుకే వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని వార్తలు వినిపిస్తున్నా వీరు మాత్రం ఖండించే ప్రయత్నాలు చేయలేదు.
అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న రష్మిక ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఎన్నో అవమానాలు పడ్డానని, ఆ బాధ తలుచుకుంటే ఇప్పటికీ బాధ కలుగుతూనే ఉంటుందంటూ చెప్పుకొచ్చింది. ‘ఆడిషన్ కి వెళ్ళిన ప్రతిసారి కూడా ఎన్నో తిరస్కారాలు ఎదురయ్యాయి. కొందరైతే నేను నటిగా సక్సెస్ కావడం కష్టమని ముఖం మీదే చెప్పేశారు. ఇక అవకాశాలు రావేమో అనే దిగులుతో కన్నీళ్లతో నేను ఇంటికి వచ్చిన సందర్భాలు బోలెడు ఉన్నాయి’.
‘దీనికి తోడు ఒక సినిమా సెలెక్ట్ చేసిన తర్వాత మూడు నెలల పాటు వర్క్ షాప్ కూడా నిర్వహించాను. ఆ తర్వాత ఆ ప్రాజెక్ట్ ని కాస్త క్యాన్సిల్ చేశారు. అలా ఎన్నో సవాళ్ళను ఎదుర్కొన్నాను. ఎప్పుడు కూడా సినీ రంగం నుంచి తప్పుకోవాలనుకోలేదు. వచ్చిన ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ నటిగా నా ప్రతిభను మెరుగుపరుచుకుంటూ ఈ స్థాయికి వచ్చాను. ఆ అవమానాలు , బాధలు కష్టాలు ఇప్పటికీ కూడా నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటాయి’ అంటూ చెప్పుకొచ్చింది రష్మిక.
ప్రస్తుతం రష్మిక చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి . ఇక ఈమె అల్లు అర్జున్ తో పుష్ప -2 సినిమాలో నటిస్తోంది. అంతేకాకుండా రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో రాబోతున్న గర్ల్ ఫ్రెండ్ అనే సినిమాలో కూడా కనిపించనుంది. ఇక త్వరలోనే సందీప్ ప్రతివంగా దర్శకత్వంలో రానున్న యానిమల్ పార్క్.. చిత్రంలో కూడా హీరోయిన్గా చేయనుంది..