Rashmika Mandanna: అన్నిటికన్నా అలా ఉండడమే నాకు ఇష్టం.. జీవితంపై రష్మిక ఊహించని కామెంట్స్..!

తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతూ పాన్ ఇండియా హీరోయిన్ గా అతి తక్కువ సమయంలోనే భారీ క్రేజ్ సంపాదించిన వారిలో రష్మిక మందన్న కూడా ఒకరు. అయితే గత కొంతకాలంగా టాలీవుడ్ హీరో విజయ్ దేవరకొండతో రిలేషన్ లో ఉందనే విధంగా వార్తలు వినిపిస్తూనే ఉన్నాయి.

కానీ ఈ విషయం పైన ఎప్పటికప్పుడు క్లారిటీ ఇచ్చిన రూమర్స్ మాత్రం ఆగడం లేదు. ఇదిలా ఉండగా ప్రస్తుతం రష్మిక, విక్కీ కౌశల్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ఛావా.ఈ సినిమా ఫిబ్రవరి 14న రిలీజ్ కాబోతోంది. డైరెక్టర్ లక్ష్మణ్ ఉటేకర్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా. ఇటీవల ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది.
ఈ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తనకు ఇల్లు మాత్రమే హ్యాపీ ప్లేస్ అని తెలియజేసింది.. తనకు సంతోషకరమైన ప్రదేశం ఏది అని అడిగితే కచ్చితంగా తాను ఇల్లే అని చెబుతానని.. ఇంట్లో ఉంటే చాలా ఆనందంగా ఉంటుంది. పాజిటివ్ గా అనిపిస్తుంది. ఎక్కడ పొందలేని ఆనందం అక్కడే లభిస్తుందని తెలిపింది.
ఎంతోమంది ప్రేమాభిమానాలు పొందినప్పటికీ తాను కూడా ఒక కూతురు, సోదరి, భాగస్వామిగా తన జీవితాన్ని గౌరవిస్తానని వెల్లడించింది.. అయితే అది పూర్తిగా తన వ్యక్తిగత జీవితం అని వెల్లడించింది రష్మిక.
అలాగే ఎదుటి వ్యక్తులలో తనను ఆకర్షించే విషయాల గురించి తెలియజేస్తూ..కళ్ళు తన మనసుకు ప్రతిబింబాలు అని కళ్ళతో పలికించే హావభావాలనే తాను ఎక్కువగా నమ్ముతూ ఉంటానని నవ్వుతూ ఉండే వ్యక్తులను మాత్రమే తాను ఇష్టపడతానని, ఎదుటివారిని గౌరవించే వారు అంటే తనకు చాలా ఇష్టమని వెల్లడించింది రష్మిక. ఇలా మొత్తానికి తన భాగస్వామి గురించి మాట్లాడడంతో ఈ వ్యాఖ్యలు మరొకసారి వైరల్ గా మారుతున్నాయి. దీంతో రష్మిక రిలేషన్ లో ఉన్నానని మరోసారి కన్ఫామ్ చేసిందని.. అలాగే తాను చెప్పింది విజయ్ గురించే అన్న విధంగా అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు