Ratan Tata: భారతరత్న ఇవ్వాలనే డిమాండ్.. మూడేళ్ల కిందే రతన్ టాటా ఏమన్నారో తెలుసా?
Bharat Ratna To Ratan Tata: అనారోగ్య సమస్యలతో పోరాడి బుధవారం అర్ధరాత్రి కన్నుమూసిన రతన్ టాటా. ఈయన 2008 లోనే పద్మవిభూషణ్ అందుకున్నారు. ఆ తర్వాత టాటాకు భారతరత్న కూడా ఇవ్వాలనే డిమాండ్ మూడేళ్ల క్రితమే చాలా మంది ప్రస్తావించారు.
దీని గురించి పెద్ద ఎత్తున సామాజిక మాధ్యమాల్లో సైతం ప్రముఖులు కూడా డిమాండ్ చేశారు. దీనిపై హ్యాష్ ట్యాగ్ కూడా క్రియేట్ చేసి పెద్ద యుద్ధమే చేశారు. కానీ, ఇలా సోషల్ మీడియాల్లో జరుగుతున్న ప్రచారాన్ని వెంటనే ఆపేయాలని ఓ పోస్టులో రతన్ టాటా అందరికీ విజ్ఞప్తి కూడా చేశారు.
దేశ అభివృద్ధిలో తన వంతు కృషి చేసినందుకు ఆనందంగా ఉందని, భారతీయుడిగా పుట్టడమే తన అదృష్టమని అప్పుడు తన వ్యాఖ్యల్లో ఈ పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ వ్యాఖ్యలు వైరల్‌గా మారాయి.
రతన్ టాటా యువతకు ఎంతో నిదర్శనం. దేశానికి టాటా అందిస్తున్న సేవలకు ఆయనకు భారతరత్న ఇవ్వాల్సిందేనని 'భారతరత్న ఫర్ రతన్ టాటా' హ్యాష్ ట్యాగ్ విపరీతంగా ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే.
యువత ఏదైనా సాధించాలంటే ముందుగా వారి శక్తి సామార్థ్యాలపై వారికి నమ్మకం ఉండాలని ఓ నెటిజెన్ ట్వీట్‌కు సైతం అప్పట్లో రతన్ టాటా బదులిచ్చారు. మరీ ఇప్పుడైనా రతన్ టాటాకు భారత్న రత్న ప్రకటిస్తారో లేదో తెలియాల్సి ఉంది.