Gold Loan EMI: గోల్డ్ లోన్ తీసుకునే వారికి ఆర్బీఐ గుడ్ న్యూస్..నెలలవారీగా ఈఎంఐ లోన్ చెల్లించవచ్చు

Wed, 20 Nov 2024-2:20 pm,

Gold Loan Calculator: మన దేశంలో బంగారానికి ఉన్న డిమాండ్ గురించి ప్రత్యేకించీ చెప్పాల్సిన అవసరం లేదు. ఇది కేవలం ఒక ఆభరణంగానే కాదు..కష్ట సమయాల్లో మనుషులకు సరైన ఆర్థిక మార్గం కూడా చూపిస్తుంది. అయితే ఇదే బంగారాన్ని నగదుగా కూడా మార్చుకోవచ్చు. చాలా మందికి కొన్ని అత్యవసర పరిస్థితుల్లో డబ్బు అవసరం ఉంటుంది.

స్నేహితులు, బంధువుల దగ్గర ఎక్కడా దొరికితే అక్కడ బ్యాంకుల్లో లోన్స్ కోసం చూస్తుంటారు. హోంలోన్స్, పర్సనల్ లోన్స్ , వెహికల్ లోన్స్ కంటే గోల్డ్ లోన్స్ పై వడ్డీ రేట్లు తక్కువగా ఉంటాయి. ఇక్కడ పెద్దగా ఎలాంటి ఇబ్బంది ఉండదు. బంగారం తాకట్టు పెట్టి లోన్ తీసుకోవచ్చు. ప్రాసెస్ కూడా చాలా తక్కువగా ఉంటుంది. ఇతర లోన్లతో పోల్చితే గోల్డ్ లోన్స్ చాలా సురక్షితమని చెప్పవచ్చు.   

మన ఆర్థిక అవసరాలను తీర్చుకునేందుకు కొన్నిసమయాల్లో బంగారాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంది. ఈ లోన్స్ సురక్షితమే అయినా ప్రస్తుతం వీటిని వాయిదాల్లో చెల్లించే సదుపాయం మాత్రం లేదు. ఈ క్రమంలోనే త్వరలోనే బంగారం లోన్స్ ఈఎంఐ పద్ధతిలో చెల్లించే సౌలభ్యాన్ని అందుబాటులోకి తీసుకురావాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యోచినట్లుగా తెలుస్తోంది. ఈ లోన్స్ మంజూరులో అవకతవకలు వెలుగుచూస్తున్నక్రమంలోనే ఆర్బీఐ ఈ నిర్ణయం తీసుకున్నట్లు పలు ఆంగ్ల మీడియాల్లో కథనాలు వెలువడుతున్నాయి. 

ప్రస్తుతం గోల్డ్ తాకట్టు పెట్టుకుని లోన్స్ ఇచ్చే సంస్థలు కస్టమర్లకు బుల్లెట్ రీపేమెంట్ ఆప్షన్ కూడా ఇస్తున్నాయి. అంటే లోన్ టెన్యూర్ పూర్తయిన తర్వాత గ్రహీత తీసుకున్న మొత్తం లోన్ ఒకేసారి చెల్లించాల్సి ఉంటుంది. లేదంటే కాలపరిమితి ముందుగానే రుణ గ్రహీత దగ్గర నిధులు అందుబాటులో ఉన్నట్లయితే అప్పటికీ అసలు, వడ్డీ మొత్తం తిరిగి చెల్లించి బంగారం విడిపించుకునే సౌలభ్యం కూడా ఉంటుంది.   

ఈ బంగారం లోన్స్ విషయంలో అవకతవకలు జరుగుతున్నట్లు ఆర్బీఐ ఈ మధ్యే గుర్తించింది. బంగారం విలువను లెక్కగట్టే విషయంలో లోపాలు సహా వేలం పారదర్శకంగా లేకపోవడం వంటివి వెలుగు చూశాయి. వడ్డీ కింద కొంత మొత్తం చెల్లించి గోల్డ్ లోన్స్ దీర్ఘకాలం కొనసాగించే విధానాన్ని చాలా మంది అవలంబిస్తున్నట్లు గుర్తించింది.

ఈ క్రమంలోనే గోల్డ్ తాకట్టు పెట్టి లోన్ తీసుకునే లోన్స్ కు కూడా నెలలవారీగా వాయిదాల విధానం అందుబాటులోకి తెచ్చే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈమధ్య సర్య్కూలర్ లో వెల్లడించినట్లు సదరు కథనాలు పేర్కొంటున్నాయి.   

ఈ ఆర్థిక ఏడాది సెప్టెంబర్ 20 నాటికి చూస్తే దేశంలోని బ్యాంకులన్నీ దాదాపు రూ. 1.4 లక్షల కోట్ల విలువైన గోల్డ్ లోన్స్ మంజూరు చేసినట్లు రిజర్వ్ బ్యాంక్ గణాంకాలు తెలిపాయి. గతేడాదితో పోల్చితే ఇది 14.6శాతం ఎక్కువ అని చెప్పవచ్చు. బంగారం ధరలు పెరగడమే ఇలాంటి లోన్స్ పెరిగేందుకు కారణమవుతున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. 

ZEENEWS TRENDING STORIES

By continuing to use the site, you agree to the use of cookies. You can find out more by Tapping this link